ETV Bharat / city

ఆ రోడ్డుకు రూ.148 కోట్ల నాబార్డు రుణం.. పార్లమెంటులో ఎంపీలు - ఏపీ తాజా వార్తలు

MPs in Parliament: గుంటూరు జిల్లాలోని రాజుపాలెం-అమరావతి మధ్య రోడ్డు విస్తరణ, బలోపేతానికి రూ.148.95 కోట్లతో అంచనాలను రూపొందించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భాగవత్‌ కరాడ్‌ తెలిపారు. సోమవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు బాలశౌరి, శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆర్‌ఐడీఎఫ్‌ కింద ఈ రహదారికి నాబార్డు రుణ మంజూరీ ప్రక్రియ ప్రస్తుతం కార్యాచరణ దశలో ఉన్నట్లు చెప్పారు.

MPs in Parliament
పార్లమెంటు
author img

By

Published : Jul 19, 2022, 9:39 AM IST

MPs in Parliament: కొత్త విధానాన్ని బట్టే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ: కేంద్రం కొత్తగా రూపొందించిన ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని అనుసరించే నాన్‌స్ట్రాటజిక్‌ విభాగంలో ఉన్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్‌ కరాడ్‌ తెలిపారు. లోక్‌సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

భారీగా తగ్గిన కొత్త స్వయం సహాయక సంఘాలు: నేషనల్‌ అర్బన్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటయ్యే స్వయం సహాయకసంఘాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2వేల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా 20,324 ఏర్పాటయ్యాయి. 2020-21లో 1,940 సంఘాల లక్ష్యం కాగా, 7,163 మొదలయ్యాయి. 2021-22లో 4,875 సంఘాలు ఏర్పాటుచేయాలని సంకల్పించగా, అంతిమంగా 5,149 మాత్రమే ఏర్పాటయ్యాయి. భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి హర్‌దీప్‌సింగ్‌ ఈమేరకు బదులిచ్చారు.

రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌టీ పరిహార బకాయి రూ.35,266 కోట్లు: దేశంలోని 31 రాష్ట్రాలకు జూన్‌ నాటికి జీఎస్‌టీ పరిహారం కింద ఇంకా రూ.35,266 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,371 కోట్లు, తెలంగాణకు రూ.1,134 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ తర్వాత కూడా రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం చెల్లించే కాలాన్ని పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కోరాయని, అయితే 101వ రాజ్యాంగ సవరణ చట్టంలోని సెక్షన్‌ 18 ప్రకారం అయిదేళ్లవరకే రాష్ట్రాలకు పరిహారం చెల్లించే వెసులుబాటు ఉన్నట్లు గుర్తుచేశారు.

హైదరాబాద్‌-విజయవాడ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులు వేగవంతం చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. 377 నిబంధన కింద ఆ అంశాన్ని ఆయన లోక్‌సభ ముందుంచారు. 2022 ఏప్రిల్‌లో ప్రారంభమైన విస్తరణ పనులు 2024 ఏప్రిల్‌లో పూర్తికావల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌ 13 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని రైలు, రోడ్డు అనుసంధానతను వేగవంతం చేయాల్సి ఉన్నా అలా చేయడం లేదని అన్నారు.

ఏపీ రెవెన్యూ లోటు రూ.4,117 కోట్లే: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తొలి ఏడాది (2014-15)లో రాష్ట్రానికి ఏర్పడిన నికర రెవెన్యూ లోటు రూ.4,117 కోట్లేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని పూర్తిగా ఇప్పటికే చెల్లించామని తెలిపారు. సోమవారం లోక్‌సభలో చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2014-15లో ఏపీకి రూ.22,949 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందనడం వాస్తవం కాదన్నారు.

పీఎం కేర్స్‌ కింద 220 మందికి ప్రవేశం: కొవిడ్‌ మహమ్మారి కాలంలో తల్లిదండ్రులిద్దరినీగానీ, ఒకరినిగానీ కోల్పోయిన 220 మంది చిన్నారులకు పీఎం కేర్స్‌ కింద కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశం కల్పించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 13, తెలంగాణ నుంచి 10 మంది విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 68 మందికి ప్రవేశం కల్పించామని తెలిపారు.

మూలధన వ్యయం రూ.1,189 కోట్లు విడుదల: మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ద్వారా ఏపీకి 2020-21లో రూ.688 కోట్లు, 2021-22లో రూ.501 కోట్లు కలిపి మొత్తం రూ.1,189 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. సోమవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు గోరంట్ల మాధవ్‌, పీవీ మిథున్‌రెడ్డి, బీవీ సత్యవతిలు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇదే పద్దు కింద తెలంగాణకు రూ.572 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.3,353 కోట్ల వ్యయం: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు ఏపీలో గత అయిదేళ్లలో రూ.3,353 కోట్లను వ్యయం చేసినట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రావ్‌ఇంద్రజిత్‌ సింగ్‌ వెల్లడించారు. లోక్‌సభలో వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బీవీ సత్యవతి, మద్దిల గురుమూర్తి, గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇదే సమయంలో తెలంగాణలో రూ.2,090.08 నిధులు ఖర్చయినట్లు చెప్పారు.

మధ్యాహ్న భోజనం పెండింగ్‌ బిల్లులు రూ.1.83 కోట్లు: రాష్ట్రంలో విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప, జిల్లాల్లో కలిపి మధ్యాహ్న భోజనానికి సంబంధించి రూ.1,83,70,785 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇందులో వంట బిల్లులకు రూ.1.42 కోట్లు, వంట చేసిన వారికి రూ.41.50 లక్షలు చెల్లించాల్సి ఉందని వివరించారు.

మూడేళ్లలో ఏపీలో 2,232, తెలంగాణలో 5,332 కంపెనీల మూత: గత మూడేళ్లలో (2019 ఏప్రిల్‌ 1 నుంచి 2022 జులై 12 వరకు) ఏపీలో 2,232, తెలంగాణలో 5,332 కంపెనీలు మూతపడినట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రావ్‌ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 1,12,509 కంపెనీల తలుపులు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులు లేకుండానే పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌, బినామీ ఆస్తులు, యాజమాన్య వివరాలు దాచిపెట్టడానికి ఉపయోగపడే వాటిని షెల్‌ కంపెనీలుగా పరిగణిస్తుంటారని పేర్కొన్నారు. ఇలాంటివి గుర్తించి మూసివేయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నట్లు చెప్పారు.

ఏపీలో 8 విద్యాసంస్థల ప్రారంభం: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 8 విద్యా సంస్థలను ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పోచా బ్రహ్మానందరెడ్డిలు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

బ్యాంకుల్లో 38వేల పోస్టులు ఖాళీ: దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 38,117 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భాగవత్‌ కరాడ్‌ తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇందులో అధికారులు 12,713, క్లర్కులు 14,226, కింది స్థాయి సిబ్బంది పోస్టులు 11,238 ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అత్యధికంగా స్టేట్‌ బ్యాంకులో 6,425 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 6,549 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరో 3,904 మంది తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారని చెప్పారు. ‘తెలంగాణలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో 87, హైదరాబాద్‌ యూనివర్సిటీలో 163, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ విశ్వవిద్యాలయంలో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మౌలానా ఆజాద్‌లో 114 మంది, హైదరాబాద్‌లో 58 మంది తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సంస్కృత విశ్వవిద్యాలయంలో 5 పోస్టులు ఖాళీగా ఉంటే... మరో 23 మంది తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు’ అని వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.