కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సచివాలయంలో కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌కు సంబంధించి కేసులేమీ నమోదు కాలేదన్నారు. అన్ని బోధనాసుపత్రులు, ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌కు సంబంధించి ఐదు పడకలతో వార్డులు, ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌పై తక్షణం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ నిరంతరం అప్రమత్తతతో ఉండాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి