రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి లేఖ రాసినట్లు వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో 390 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని.. ప్రస్తుతం 360 టన్నులే అందుబాటులో ఉందని తెలిపారు. పూర్తిస్థాయి ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి రోజుకు వంద టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని.. మిగతా ఆక్సిజన్ తమిళనాడు, బళ్లారి నుంచి రాష్ట్రానికి వస్తోందని తెలిపారు.
'సి.టి.స్కాన్ ధర రూ.3 వేలు మించకూడదు. అధిక ఫీజులు తీసుకునే స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంటుంది. ఫిర్యాదులు వచ్చే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం హెచ్చరించినా తప్పులు చేసే ఆస్పత్రుల గుర్తింపు రద్దు చేస్తాం. హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారికి నిత్యం సేవలు అందించాలి' - మంత్రి ఆళ్ల నాని
ఇదీ చదవండి: విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు