కరోనా నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ భాజపా భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నందున పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ప్రజారవాణా ద్వారానే వెళ్లాల్సి ఉంటుందని.. ఈ ప్రయాణాలు కరోనా వ్యాప్తికి దోహదమవుతాయన్నారు. విద్యార్థుల భద్రత, రక్షణ దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.
కరోనా చికిత్సకు అధిక ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు కోరారు. కొవిడ్ వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: హనుమంతుడి జన్మస్థానంపై తితిదే ప్రకటన