నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండురోజుల్లో బిహార్, పశ్చిమ బంగా, ఒడిశా రాష్ట్రాలకు విస్తరిస్తాయని అధికారులు వెల్లడించారు. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు(rains) కురుస్తాయని తెలిపారు. దక్షిణకోస్తాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వర్షాలు, ఉత్తర కోస్తాలో వర్షాలు, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అంకుల్ జీ' కామెంట్‌కు గవర్నర్ స్ట్రాంగ్ కౌంటర్