అమరావతిలో రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌తో మార్చిలో దిల్లీలో ఆందోళన చేయనున్నట్లు రాజకీయేతర ఐకాస ప్రకటించింది. గుంటూరులో సమావేశమైన ఐకాస నేతలు.... అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇటీవల దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశామని... ఈసారి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు తెలిపారు. దాదాపు 5 వేల మంది రైతులు, రాజధాని ప్రాంత ప్రజలతో దిల్లీ రాంలీలా మైదానంలో మూడు రోజుల పాటు ఆందోళన చేయనున్నట్లు ఐకాస నేత మల్లిఖార్జున తెలిపారు. మార్చి 15 వ తేదీన అందరూ కలిసి ప్రత్యేక రైళ్లలో దిల్లీ వెళ్తామన్నారు.
ఇదీ చదవండి: