Farmers Agitations at Guntur Collectorate: రాజధాని అమరావతి గ్రామాల్లో తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ అక్కడి రైతులు, మహిళా కూలీలు గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకి దిగారు. 29 గ్రామాల పరిధిలో లక్షా 22వేల మంది వ్యవసాయ కూలీలు జీవిస్తున్నారని.. మూడు రాజధానుల ప్రకటన తర్వాత వ్యవసాయ పనులకు అవకాశం లేకుండాపోయిందని రైతులు వాపోయారు. ఈ ఫలితంగా ఉపాధి లేకపోవడంతో పస్తులతో కాలం గడుపుతున్నారని రైతులు పేర్కొన్నారు. జనం పార్టీ, రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేదలకు సామాజిక పింఛన్ రూ. 2,500 నుంచి 5వేలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ప్రతినెలా సామాజిక పింఛన్ ఇవ్వాలని.. టిడ్కో గృహాలను అర్హులకు తక్షణమే అప్పగించాలని రాష్ట్రీయ మహాజన సమితి అధ్యక్షులు ఆనందకుమార్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..
ORDINANCE: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ఆర్డినెన్స్ జారీ