పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు 520వ రోజు ఆందోళనలు చేపట్టారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, పెదపరిమిలో రైతులు ఇళ్లవద్దే నిరసనలు కొనసాగించారు. తమను ఆదుకోవాలంటూ.. రైతులు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
''ప్రధాని హోదాలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మీరు.. ఇక్కడి ప్రాంత అభివృద్ధిపై శ్రద్ధ చూపించాలి. వైకాపా ప్రభుత్వం వల్ల ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో 200మంది రైతులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి'' అంటూ.. ప్రధానికి ట్విటర్, పోస్టు ద్వారా లేఖ పంపించారు. లేఖ అందినట్లు ప్రధాని కార్యాలయం నుంచి రైతులకు సమాచారం ఇచ్చారు.
ఇదీ చదవండీ... స్టేట్‌లో ఫస్ట్‌టైం: గుంటూరు జిల్లాలో రెమిడిసివిర్ తయారీ