ETV Bharat / city

ప్రజాప్రతినిధి భర్త పాడు పని.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని - Kidnapping rampage in Sangareddy district

Kidnap: ఆయన ఓ ప్రజాపతినిధి భర్త.. అందరికి మంచి చెప్పాల్సిన తానే అన్యాయానికి పాల్పడ్డాడు. తన బంధువుల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళ భర్తను కిడ్నాప్ చేశాడు. ఈఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో 15రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

KIDNAP
ప్రజాపతినిధి
author img

By

Published : Sep 28, 2022, 8:37 PM IST

Kidnap: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయించడం కలకలం సృష్టించింది. 15రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. అమీన్​పూర్​ మున్సిపాలిటీకి చెందిన ఓ కోఆప్షన్ సభ్యురాలి భర్త శిఖామణి.. తన బంధువులకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయాన్ని గమనించిన సదరు మహిళ భర్త.. రాజు వారి బాగోతాన్ని వీడియోలు తీశాడు. ఈ విషయం తెలుసుకున్న శిఖామణి తన అనుచరులను పంపించి.. రాజును కిడ్నాప్ చేయించాడు. అతని వద్ద ఉన్న వీడియోలను తీసివేయించి రాజును విడిచిపెట్టారు. ఈ ఘటన 15రోజుల క్రితం జరగగా బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమీన్​పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలో ఏడుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురి నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు సెల్​ఫోన్​లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు. సదరు బాధితుడు రాజుపై అతని భార్య గతంలో ఖమ్మంలో కేసు పెట్టినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.