కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ఆరోగ్యం బాగు చేయడంపై ముందుగా చొరవ చూపిన తర్వాతే.. తమపై విమర్శలు చేయాలని రాజధాని ప్రాంత మహిళలు ప్రభుత్వానికి సూచించారు. పరిపాలన రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ.. రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 505వ రోజుకి చేరాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మహిళలు ఇంటి వద్దే నిరసనలు తెలిపారు.
ఇదీ చదవండి: ఒక్క టీకానూ వృథా కానివ్వని కేరళ- మోదీ ఫిదా
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించకుండా.. తమ ఉద్యమంపై మంత్రులు వ్యాఖ్యలు చేస్తే సహించబోమని రాజధాని ప్రాంత మహిళలు తేల్చి చెప్పారు. తామంతా ప్రభుత్వాన్ని నమ్మి భూమిలిస్తే.. అందులోనే పాలన చేస్తూ విమర్శలు గుప్పించడం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
గుంటూరు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ.. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి