అమరావతిలో రైతుల ఆందోళన 37వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో మహిళలు పూజలు చేయనున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర గ్రామాల్లోనూ నిరసనలు చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల ఆందోళనలు కొనసాగనున్నాయి. ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల ఆందోళనలు తలపెట్టాయి. శాసనమండలి నిర్ణయంతో తాత్కాలిక ఊరట లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయినా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని తెదేపా ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
ఇవీ చదవండి: