ఇవీ చూడండి:
అమరావతి కోసం చిన్నారుల పోరుబాట - mandhadam formers on capital
మందడంలో అమరావతి రైతుల ఆందోళనలు 54వ రోజూ ఉద్ధృతంగా జరుగుతున్నాయి. రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 11వరోజుకు చేరుకున్నాయి. రైతులకు సంఘీభావంగా విద్యార్ధులు, చిన్నారులు సైతం ఆందోళనలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రైతుల ఆవేదనను పట్టించుకోకుండా తమ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని తరలించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మమ్మల్ని సైతం దీక్షలో కూర్చొబెట్టిన ఘనత సీఎం జగన్‌ది:విద్యార్థులు