ETV Bharat / city

రాజధానిలో కేంద్రం పాత్ర లేదనడం.. రాజ్యాంగ ఉల్లంఘనే..! - అమరావతి జేఏసీ లేఖ వార్తలు

రాష్ట్ర రాజధాని ఎంపికపై కేంద్రం పాత్ర లేదనడం రాజ్యాంగ విరుద్ధమని అమరావతి పరిరక్షణ సమితి పేర్కొంది. దీని వల్ల ఘర్షణలు, ఇతరత్రా పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అధికార మార్పిడి జరిగినపుడల్లా వారి వారి అభీష్టాల మేరకు రాజధాని, హైకోర్టులు మార్పులు చేసుకునే అవకాశం ఉండొచ్చని ఆందోళన వ్యక్తపరిచింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అమరావతి ఐకాస ఛైర్మన్‌ జీవీఆర్​ శాస్త్రి లేఖ రాశారు. కేంద్రం నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు.

రాజధానిలో కేంద్రం పాత్ర లేదనడం.. రాజ్యాంగ ఉల్లంఘనే..!

author img

By

Published : Aug 8, 2020, 3:20 AM IST

రాష్ట్రంలో రాజధాని మార్పు, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన విషయాల్లో కేంద్రం పాత్ర లేదంటూ... కేంద్ర హోంశాఖ అధికారులు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని అమరావతి పరిరక్షణ సమితి తప్పుపట్టింది. ఈ అఫిడవిట్‌ రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. అఫిడవిట్‌పై పునఃపరిశీలన చేయాలని కోరుతూ... కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు అమరావతి ఐకాస ఛైర్మన్‌ జీవీఆర్ శాస్త్రి లేఖ రాశారు.

కేంద్ర హోంశాఖ ఈ నెల 6న ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో రాజధాని ఎంపిక, ఏర్పాటుపై కేంద్రం పాత్ర ఉండదని.. రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం మేరకే ఉంటుందని స్పష్టం చేసిందని లేఖలో గుర్తుచేశారు. అయితే... అదే అఫిడవిట్‌లోని 11, 12 పేరాలు పరిశీలించాలని జీవీఆర్‌ శాస్త్రి కోరారు.

11వ పేరాలో..

  • ఏపీ పునర్విభజన చట్టం-2014 సెక్షన్​ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్​ కమిటీ రాజధానిపై పలు సూచనలు చేసింది. తదనంతరం ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్​ 23న రాజధానిగా అమరావతిని నోటిఫై చేసింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఎంపిక రాష్ట్రం నిర్ణయిస్తుందని.. దీంట్లో కేంద్రం పాత్ర ఉండదని అంటున్నారు.

12వ పేరాలో..

  • ఈ ఏడాది జులై 31న ఏపీ ప్రభుత్వం ఏపీ డీసెంట్రలైజేషన్​, ఇన్​క్లూజివ్​ డెవలప్​మెంట్​ ఆఫ్​ ఆల్​ రీజియన్స్​ యాక్ట్​-2020ను గెజిట్​లో ప్రచురించింది. దాని ప్రకారం రాష్ట్రానికి శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దీన్నిబట్టి రాష్ట్ర రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర ఉండదని కేంద్రమే తెలిపినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత మూడు రాజధానుల వల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని శాస్త్రి లేఖలో పేర్కొన్నారు.

పునఃపరిశీలించండి..!

అఫిడవిట్‌లో పేర్కొన్న.. "కేంద్రం పాత్ర లేదు" అనే అంశాన్ని... ఈ విషయంలో జరిగిన పొరపాటుగా భావిస్తున్నామన్నారు. ఇది కేంద్ర హోంశాఖ విధాన నిర్ణయం కాదని ఆశిస్తున్నామన్నారు. ఒకవేళ కేంద్ర విధానం ఇలాగే ఉంటే.... రాష్ట్రాల్లో ఆందోళనలు, ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని వివరించారు. అధికార మార్పిడి జరిగినప్పుడల్లా... వారి వారి అభీష్టాల మేరకు రాజధాని మార్పులు చేసుకునే అవకాశం ఉందన్నారు. అఫిడవిట్‌పై మరోసారి పరిశీలించి.. రాజ్యాంగ ఉల్లంఘనలు లేకుండా చూడాలని తన లేఖలో జీవీఆర్‌ శాస్త్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. లేఖ ప్రతులను ప్రధాన మంత్రి, ప్రధాన మంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపారు.

ఇదీ చూడండి..

సీఎస్​ అధ్యక్షతన జిల్లాల పునర్‌వ్యవస్థీరణకు కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.