ETV Bharat / city

JAC LETTERS: దేశంలో ఎంపీలకు అమరావతి ఐకాస లేఖలు - పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రైతుల ఉద్యమంపై చర్చించాలని కోరుతూ.. ఎంపీలు అందరికీ అమరావతి జేఏసీ (JAC) లేఖలు రాసింది. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరింది. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల మంది రైతుల ప్రయోజనాలతోపాటు.. ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడుల పరిరక్షణే తమ ధ్యేయమని తెలిపింది.

AMARAVATHI JAC LEADERS LETTERS TO MPs
దేశంలో ఎంపీలకు అమరావతి ఐకాస లేఖలు
author img

By

Published : Jul 5, 2021, 4:08 AM IST

ఈనెల 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. దేశంలోని ఎంపీలందరికీ అమరావతి ఐకాస లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని.. అమరావతి ఐకాస ఛైర్మన్‌ జీవీఆర్‌ శాస్త్రి, కన్వీనర్‌ శివారెడ్డి లేఖల్లో కోరారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు ఇచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాలను.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించిన రూ.10 వేల కోట్ల రూపాయల వ్యయం, ఇతర పెట్టుబడులను పరిరక్షించటమే తమ ప్రధాన ధ్యేయమని ఐకాస నేతలు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోందని.. దీనికి వ్యతిరేకంగా ఏడాదిన్నర పైగా ఉద్యమం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారని.. దిల్లీని మించిన ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన మద్దతు తెలిపారని లేఖలో తెలిపారు. ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో.. 29 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాలను రాజధానికి ఇచ్చారని.. ఈ విధానానికి ఎంతగానో ప్రశంసలు దక్కాయని గుర్తుచేశారు.

అమరావతిలో భవనాలు, ఇతర మౌలిక వసతులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిపి సుమారు రూ. 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతి.. రెండు జాతీయ రహదారులు, అతిపెద్ద రైల్వే జంక్షన్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవులకు సమీపంలోనే ఉందని వివరించారు. 2014లో పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉండాలని.. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విభజించేందుకు ప్రయత్నిస్తోందని ఐకాస లేఖలో తెలిపింది. ఇప్పటికే హైకోర్టు అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని వెల్లడించింది. మూడు రాజధానుల బిల్లును శాసన మండలి తిరస్కరించిందనే కారణంతో.. రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలినే రద్దు చేస్తూ తీర్మానం చేసిందని ఎంపీల దృష్టికి తీసుకొచ్చారు.

వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. దాదాపు 60 అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇచ్చిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించగా..హైకోర్టు జోక్యంతో తిరిగి బాధ్యతలు స్వీకరించారని తెలియజేసింది. రాజకీయ ప్రత్యర్థులు, మీడియా, సామాన్య ప్రజలను వేధించేందుకు పోలీసులను వ్యక్తిగత సిబ్బందిగా స్థానిక ప్రభుత్వం వినియోగిస్తోందని తెలిపింది. హిందూ సంప్రదాయాలపై దాడి చేస్తూ.. మత మార్పిళ్లు ప్రోత్సహిస్తోందని ఫిర్యాదు చేసింది. హిందూచరిత్ర, సంస్కృతిని నాశనం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, హిందూ ఆలయాల నిధులను వినియోగిస్తున్నట్లు వివరించింది. రాష్ట్ర రాజధాని ఎంపిక, ఏర్పాటులో తమ పాత్ర ఏమీ లేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేంద్ర హోంశాఖ గతేడాది ఆగస్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిందని.. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తెలిపింది. ఇదే తరహాలో కేంద్రం వ్యవహరిస్తే.. భవిష్యత్తులో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. రాజధానులు మార్చుకునే గందరగోళ సంస్కృతికి దారితీస్తుందని.. ఐకాస ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే రాజధాని అమరావతి పేరుతో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు సంస్థలతో అణిచివేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తోందని లేఖలో ఆరోపించారు. అవకాశం దొరికినప్పుడు పార్లమెంటులో తమ ఉద్యమ విషయాన్ని లేవనెత్తాలని ఐకాస నేతలు GVR శాస్త్రి, శివారెడ్డిలు ఎంపీలను విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.