పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు, మహిళలు 334వ రోజు ఆందోళనలు నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో దీక్షలు చేశారు. అమరావతికి మద్దతుగా దీక్షా శిబిరాల్లో నినాదాలు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్కు అమరావతి, పోలవరం కట్టే సామర్థ్యం లేదని విమర్శించారు. తుళ్లూరులో మహిళలు భగవద్గీత చదువుతూ నిరసన తెలిపారు.
ఇవీ చదవండి..