పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు 314వ రోజు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, పెదపరిమి, నీరుకొండ, ఐనవోలు గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
కృష్ణాయపాలెంలో రైతుల దీక్షకు మద్దతుగా అమరావతి ఐకాస నేతలు సంఘీభావం ప్రకటించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరులో మహిళలు గ్రామ దేవతలైన అంకాలమ్మ, పోలేరమ్మ, పలనాటి వీరులు, కనకదుర్గమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చదవండి..