రాష్ట్రానికి దశ, దిశను నిర్ణయించేది రాజధాని అమరావతేనని, దీనిని నిర్లక్ష్యం చేయొద్దని రైతులు కోరారు. అమరావతిని విస్మరిస్తే భావితరాల భవిష్యత్తును కాలరాయడమేనన్నారు. తమకు సీఎం జగన్ భరోసా ఇవ్వాలని కోరారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని పూర్తి చేయకుండా.. విజయవాడలో కొత్తగా శంకుస్థాపన చేయడం దుర్మార్గమన్నారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు 206వ రోజుకు చేరుకున్నాయి. అనంతవరంలో కొండపై వెలసిన వెంకన్న ఆలయ భూములను పరిరక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇంటింటి అమరావతి కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతంలోని మండదం, రాయపూడి, పెదపరిమి, అనంతవరం, బోరుపాలెం, మల్కాపురం, వెలగపూడి, తుళ్లూరులో నిరసనలు జరిగాయి.
దుర్గమ్మకు సారె:
అమరావతి రైతులకు న్యాయం చేయాలని, కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని విజయవాడ మొగల్రాజపురానికి చెందిన శివలలితా మహిళా మండలి బృంద సభ్యులు... ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను వేడుకున్నారు. అమ్మవారికి సారెను సమర్పించారు. తొలుత వీరికి దేవస్థానం ఈవో సురేష్‌బాబు, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, వైదిక కమిటీ సభ్యులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు.
ఇదీ చదవండి: