రాజధాని గ్రామాల్లో అమరావతి ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. కృష్ణాయ పాలెం, ఐనవోలు, మందడం తుళ్లూరు వెలగపూడిలలో రైతులు మహిళలు చేస్తున్న ఉద్యమం 268వ రోజుకు చేరుకుంది. మందడంలో రైతులు మహిళలు చేస్తున్న దీక్షకు నరసరావుపేటకు చెందిన 20 మంది రైతులు మద్దతు పలికారు. దీక్ష శిబిరంలో కోడెల విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
రాజధాని నిర్మాణం కోసం మందడంలో మహిళలు భిక్షాటన చేశారు. ప్రధాన రహదారిలో దుకాణాల వెంట తిరుగుతూ విరాళాలు సేకరించారు. రాజధాని నిర్మాణానికి నిధులు లేవన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా తామంతా బిక్షాటన చేస్తున్నామని చెప్పారు. 13 జిల్లాల్లో భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను రాజధాని నిర్మాణానికి ఇస్తామని రైతులు తెలిపారు. రాజధానిపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను రైతులు తిప్పికొట్టారు.
ఇదీ చదవండి: బిల్డింగ్ విషయమై రెండేళ్ల క్రితమే కంగనకు నోటీసులు?