గుంటూరు జిల్లా అమరావతి రైతుల బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న జిల్లా న్యాయస్థానం...తీర్పుని ఈనెల 5వ తేదికి వాయిదా వేసింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనకు వెళ్తున్న వారిని అడ్డుకున్న కేసులో 11మందిపై ఎస్సీ వేధింపుల చట్టం క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అరెస్టయి...ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వారు పెట్టుకున్న అభ్యర్థన ఇవాళ జిల్లా కోర్టు ముందుకు రాగా.. నిర్ణయాన్ని 5వ తేదీకి వాయిదా వేశారు.
ఇదీచదవండి