ఈ నెలలో ఇప్పటికీ అర్హులకు పింఛన్లు అందకపోవడంపై అమరావతి జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. సకాలంలో పింఛన్లు అందట్లేదని పింఛనర్ల సంఘం ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు వచ్చేవని.. ప్రస్తుతం పింఛను ఏరోజు వస్తుందో గ్యారంటీ లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
11 రోజులైనా ఈ నెలలో ఇంకా చాలామందికి పింఛన్లు రాలేదన్నారు. పింఛన్లు చెల్లించాకే తమ జీతాలు చెల్లించాలని పలుమార్లు కోరినట్లు బొప్పరాజు స్పష్టం చేశారు. పింఛన్లలో జాప్యంపై సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు వచ్చేలా సీఎస్ చర్యలు తీసుకోవాలని బొప్పరాజు కోరారు.
ఇదీ చదవండి: