ETV Bharat / city

550వ రోజు ఆందోళనలు... ర్యాలీ నిర్వహించిన మహిళలు

author img

By

Published : Jun 19, 2021, 2:23 PM IST

Updated : Jun 20, 2021, 5:15 AM IST

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 550వ రోజుకు చేరాయి. మందండంలో బుద్ధుని విగ్రహానికి అంజలి ఘటించిన మహిళలు... ఉద్దండరాయునిపాలెంలో పోలేరమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అమరావతిని విశాఖకు తరలించలేరని స్పష్టం చేశారు.

550వ రోజు ఆందోళనలు... ర్యాలీ నిర్వహించిన మహిళలు
550వ రోజు ఆందోళనలు... ర్యాలీ నిర్వహించిన మహిళలు

అదే జోరు.. అదే హోరు. కరోనా భయపెడుతున్నా.. ఆంక్షలు అడ్డొచ్చినా అమరావతి రైతులు వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ పంథా కొనసాగించారు. ఊరూ వాడా ఏకమై కదం తొక్కారు. రాజధాని గ్రామాలను నిరసనలతో హోరెత్తించారు. వైకాపా నాయకులు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నుంచి మట్టి పెళ్లను కూడా తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారం నుంచి దిగేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని సాధించుకుంటామని పునరుద్ఘాటించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 550వ రోజుకు చేరింది. కొవిడ్‌ వ్యాప్తి, కర్ఫ్యూ అమలు దృష్ట్యా రైతులు జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్కడికక్కడ నిరసనలు కొనసాగించారు. భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు.

550వ రోజుకు చేరిన ఆందోళనలు

ఊరూరా నిరసనల హోరు..
నిరసనల్లో భాగంగా ఉద్దండరాయునిపాలెంలో రైతులు దీక్షా శిబిరం నుంచి పోలేరమ్మ ఆలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని ప్రార్థించారు. మందడంలో దీక్షా శిబిరం నుంచి స్థానిక శివాలయం, రామాలయం వరకూ మహిళలు ర్యాలీ తీశారు. అనంతవరంలో న్యాయదేవత చిత్రపటానికి పూజలు చేశారు. నెక్కల్లులో రైతులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళలు గీతాపారాయణం చేశారు. పెదపరిమిలో వేంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. మందడంలో బుద్ధుడి విగ్రహానికి అంజలి ఘటించారు. తుళ్లూరు, వెలగపూడి దీక్షా శిబిరాల్లో మహిళలు, చిన్నారులు పెద్దయెత్తున దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్దండరాయునిపాలెం నుంచి రైతులు మందడం వెళ్లేందుకు సీడ్‌ యాక్సిక్‌ రోడ్డుపైకి రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గారు.

ఐకాస నేతల గృహ నిర్బంధం
సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, సుంకర పద్మశ్రీ, రాయపాటి శైలజ, దుర్గాభవాని, అక్కినేని వనజ, మల్లికార్జునరావు తదితరులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. గృహ నిర్బంధంపై ఐకాస నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని అడ్డుకోలేరని, పోలీసులు నోటీసులివ్వకుండా అరెస్టు చేయడం తమ హక్కుల్ని కాలరాయడమేనని విమర్శించారు. ఎన్ని రోజులు అడ్డుకుంటారో తాము చూస్తామని, ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని సాధించుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు ఎలాంటి నోటీసులివ్వకుండా గృహ నిర్బంధంలో ఉంచడం దారుణమని అమరావతి దళిత ఐకాస కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ మండిపడ్డారు. రాజధానిని మూడు ముక్కలు చేయాలని చూస్తే ఎస్సీల సత్తా ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు.

పోలీసుల పహారాలో శిబిరాలు
అమరావతి రైతులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో రాజధాని గ్రామాల్లో పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరాల ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు పహారా కాశారు. తుళ్లూరు నుంచి మందడం వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు.

రాజధాని ఉద్యమమంటే సీఎంకు భయం
అమరావతి బహుజన ఐకాస, దళిత బహుజన ఫ్రంట్‌ల విమర్శ

రాజధాని ఉద్యమం పేరు వింటేనే సీఎం జగన్‌ భయపడుతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యరావు పేర్కొన్నారు. మహిళా శక్తికి భయపడి ప్రభుత్వం గృహ నిర్బంధాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అమరావతి ఉద్యమం 550వ రోజుకు చేరుకున్న సందర్భంగా రైతులు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తారేమోనన్న భ్రమతో ప్రభుత్వం పలువురు ఐకాస నేతలను గృహ నిర్బంధంలో ఉంచిందని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. రైతుల ఆవేదన నుంచి పుట్టిన అమరావతి ఉద్యమానికి విజయం తప్ప.. అపజయం ఉండబోదన్నారు.

అమరావతే రాజధానిగా కొనసాగుతుంది: లోకేశ్‌

ఆలస్యమైనా న్యాయపోరాటంలో విజేతగా నిలిచి అమరావతి ప్రజారాజధానిగా కొనసాగుతుందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘‘నియంత సర్కారు నిర్బంధాలను ఎదిరించి పోరాడుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమకారులకు నా అభివందనాలు. 550 రోజులుగా సాగుతున్న మీ శాంతియుత పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. వెలకట్టలేని త్యాగాలు చేసిన మీవైపు ధర్మం ఉంది’’ అని శనివారం ఆయన ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి:

EAMCET: ఎంసెట్‌కు బదులుగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Last Updated : Jun 20, 2021, 5:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.