రాష్ట్రాభివృద్ధి కోసం భూములు ఇస్తే..రాజధాని నిర్మించకుండా ఇతరులకు ఎలా కేటాయిస్తారని అమరావతి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ... తుళ్లూరు, మందడం, వెలగపూడి, నేలపాడు, ఐనవోలు, ఎర్రబాలెం ఉద్ధంరాయునిపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు 343వ రోజు ఆందోళన కొనసాగించారు.
ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేదన్న ముఖ్యమంత్రి జగన్...పేదల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు విమర్శించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు తాము అడ్డం కాదని...,వారి కోసం మేం భూములు ఇవ్వలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పక్క రాష్ట్రానికి మేలు చేకూరేలా పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీచదవండి