అమరావతి పోరు 200 రోజులకు చేరిన సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించారు. ఐర్లాండ్ దేశంలో ఉంటున్న తెలుగువారు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని'... అంటూ నినదించారు. 200 రోజులుగా జరుగుతున్న ప్రజా రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా ఒక్కటవ్వాలని వారు పిలుపునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరావతిని కాపాడుకుందామని ప్రతిన బూనారు.
ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్, కోర్క్, డండాల్క్, ఎత్లోన్, గాల్వే నగరాల్లో ఈ ప్రదర్శనలు సాగాయి. కొందరు సామూహికంగా ప్రదర్శనలో పాల్గొనగా... మరికొందరు ఎవరి ఇళ్లలో వారు ఉండి అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: