అత్యంత ప్రాధాన్యం కలిగిన అమరావతిని వైకాపా ప్రభుత్వం చంపేసిందని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రులు రాజధానిపై తలో మాట మాట్లాడుతుంటే... ముఖ్యమంత్రి మౌనం వహిస్తుండటం కుట్రలో భాగమేనని ఆరోపించారు.
ప్రజా రాజధాని అమరావతి పేరిట రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన అంశాలే ప్రధాన అజెండాగా భేటీ జరగనుందన్నారు. ఈ సమావేశానికి 17 రాజకీయ పార్టీలు, 22 విభాగాలు, సంఘాలకు ఆహ్వానం పంపామన్న అచ్చెన్నాయుడు... 90 శాతం పార్టీలు ఇప్పటికే తమ సానుకూలత తెలిపాయని వివరించారు. రాజధాని ఒకటి రెండు జిల్లాలకే పరిమితమనే తప్పుడు ప్రచారం వైకాపా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అనేది రాష్ట్రానికి ఆదాయవనరుగా గ్రహించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి : కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు..ఉత్తర్వులు జారీ