హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను భారీ వానలు ముంచెత్తాయి. వరద నీటితో కాలనీలు జలమయమయ్యాయి. కార్లు, ద్విచక్రవాహనలు సగంవరకు నీటమునిగాయి. రోడ్లపై నీటి ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అంబర్ పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నంతో పాటు మీర్‌పేట, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. భారీ వర్షాల ధాటికి ముసారాంబాగ్ వంతెన పైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్ వంతెన పూర్తిగా నీటమునిగింది.
హైదర్‌గూడ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్ ప్రాంతాల్లో నగరవాసులు తడిసిముద్దయ్యారు. యాకత్పురా, అంబర్‌పేట్, బాగ్ లింగంపల్లి తదితర ప్రాంతాల్లో వరదనీటిలో వాహనదార్లు ఇక్కట్లు పడ్డారు. నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, లిబర్టీ తదితర ప్రాంతాల్లో విడతల వారీగా వాన కురిసింది.