ETV Bharat / city

AICTE: బిటెక్ కనీస వార్షిక రుసుం 75వేలు...తుది నిర్ణయం ఏఎఫ్‌ఆర్‌సీలదే...

దేశవ్యాప్తంగా బీటెక్ కనీస వార్షిక ఫీజు 75 వేల రూపాయలు ఉండాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ సిఫార్సులపై అభిప్రాయాలు తెలపాలని ఏఐసీటీఈ(AICTE) రాష్ట్రాలకు లేఖలు రాసింది. అభిప్రాయలను తెలిపేందుకు రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ కసరత్తు చేస్తోంది. కమిటీ నిర్దేశిత రుసుములు అమలైతే తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది.

Btech fee
బిటెక్ కనీస వార్షిక రుసుం 75వేలు...తుది నిర్ణయం ఏఎఫ్‌ఆర్‌సీలదే...
author img

By

Published : Oct 7, 2021, 11:23 AM IST

దేశవ్యాప్తంగా వృత్తివిద్య కోర్సుల రుసుములను నియంత్రించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి.. ఏఐసీటీఈ (AICTE) నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. దేశవ్యాప్తంగా బీటెక్ వార్షిక రుసుము 75వేల రూపాయలు ఉండాలని కమిటీ నిర్దేశించింది. దేశంలో కొన్ని విద్యా సంస్థలు బీటెక్, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులకు 3 లక్షల రూపాయల నుంచి 9 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులను నియంత్రించాలన్నఉద్దేశంతో ఏఐసీటీఈ 2014 ఏప్రిల్ 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ ఛైర్మన్‌గా పది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ అంశాలను పరిశీలించిన శ్రీకృష్ణ కమిటీ 2015 ఏప్రిల్ 7న ఏఐసీటీఈకి నివేదిక సమర్పించింది. నగరాలు, పట్టణాలను బట్టి.. బీటెక్‌కు గరిష్ఠంగా లక్షా 44 వేల నుంచి లక్ష 58 వరకు ఫీజు ఉండాలని సిఫార్సు చేసింది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకే గరిష్ఠ ఫీజులు ఉండాలని రాష్ట్రాల ఏఎఫ్‌ఆర్‌సీలకు 2017 జనవరిలో ఏఐసీటీఈ స్పష్టం చేసింది. అయితే ఫీజులు ఎంత ఉండాలనే విషయం తమ పరిధిలోనే ఉంటుందంటూ ఏఎఫ్ఆర్ సీలు.. ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయడం లేదు.

కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు శ్రీకృష్ణ కమిటీ.. తాజాగా కనిష్ఠ రుసుములను కూడా ప్రతిపాదించింది. కనీసం 75వేల రూపాయలు వార్షిక ఫీజు ఉండాలని పేర్కొంది. తుది నిర్ణయం తీసుకొనే అధికారం రాష్ట్రాల ఏఎఫ్‌ఆర్‌సీలదేనని స్పష్టం చేసింది. ఏఎఫ్ఆర్‌సీ నిర్ణయించిన కనీస ఫీజు 75వేల కన్నా తక్కువగా ఉంటే.. ఆ కాలేజీల్లో వసతులు సరిగా లేనట్లుగా పరిగణించాలని కమిటీ సూచించింది. మూడేళ్లలో వసతులను మెరుగు పరుచుకోక పోతే.. అలాంటి కాలేజీలను మూసివేయాలని ప్రతిపాదించింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలైతే.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కనీస వార్షిక ఫీజు 35వేల రూపాయలే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 20 కాలేజీల్లో 35వేల రూపాయలు.. మరో వంద కళాశాలల్లో 75వేల రూపాయల లోపే ఫీజు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఫీజే 70వేల రూపాయలు ఉంది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాల ఏఎఫ్ఆర్ సీలకు ఏఐసీటీఈ ఇటీవల లేఖలు రాసింది. త్వరలో అభిప్రాయాలను తెలిపేందుకు తెలంగాణ ఏఎఫ్‌ఆర్‌సీ కసరత్తు చేస్తోంది.

ఇదీ చూడండి: ఎయిడెడ్‌ అధ్యాపకుల పోస్టింగ్‌లలో అయోమయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.