ETV Bharat / city

NAGABABU: మా మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు: నాగబాబు - మా మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు: నాగబాబు

సినిమా పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం సంకుచిత ధోరణితో ప్రవర్తిస్తోందని సినీ నటుడు నాగబాబు తెలిపారు. పవన్‌ కల్యాణ్​పై కక్ష సాధించడం కోసమే సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన జీవో రిలీజ్‌ చేయలేదని సినీ నటుడు నాగబాబు పరోక్షంగా అన్నారు. ‘మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు’ అంటూ.. ఏపీ సర్కార్​పై విమర్శల వర్షం కురిపించారు.

NAGABABU on ysrcp
నాగబాబు
author img

By

Published : Feb 28, 2022, 4:37 PM IST

Updated : Feb 28, 2022, 5:01 PM IST

మా మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు: నాగబాబు

NAGABABU: సినిమా పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం సంకుచిత ధోరణితో ప్రవర్తిస్తోందని సినీ నటుడు నాగబాబు తెలిపారు. పవన్‌ కల్యాణ్​పై కక్ష సాధించడం కోసమే ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌ నేపథ్యంలో సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన జీవో రిలీజ్‌ చేయలేదని ఆయన పరోక్షంగా అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు’ అంటూ ఆయన రిలీజ్‌ చేసిన వీడియోలో ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇకనైనా.. మంచి పాలన చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు.

‘‘గత కొద్దికాలంగా సినిమా టికెట్ల విషయంలో వైకాపా ప్రభుత్వం, మంత్రులు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలోని కార్యకలాపాలపై వాళ్లకు ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి వాళ్లని నేను ఏం అనలేను. సామాన్యుడికీ సినిమా టికెట్‌ ధరలు అందుబాటులోకి రావాలని మీరు అంటున్నారు. దాన్ని నేనూ అంగీకరిస్తా. కానీ, మన సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే దాన్ని తెరకెక్కించడంలో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నటీనటుల పారితోషికాలు సినిమాకి పెట్టిన ఖర్చులో భాగం కాదని మీరు అంటున్నారు. సినిమాకి పెట్టే మొత్తం ఖర్చులో కేవలం 12 నుంచి 20శాతం మాత్రమే హీరోలకు పారితోషికంగా ఇస్తాం. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. తమ సినిమా కనుక పరాజయం పొందితే హీరోలు పారితోషికాన్ని తగ్గించుకుంటారు. కొన్నిసార్లు వెనక్కి ఇచ్చేస్తారు. మా అన్నయ్య, పవన్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌, ప్రభాస్‌.. ఇలా ఎంతోమంది హీరోలు.. తమ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడనప్పుడు నిర్మాతకు బాసటగా ఉండటానికి పారితోషికాన్ని తగ్గించుకున్నవారే. కానీ వాళ్లు ఆ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. సినిమా అనేది ఒక వ్యాపారం. హీరోలను ఆధారంగా చేసుకునే ఆ బిజినెస్‌ జరుగుతుంది’’

‘‘మీకున్న వ్యక్తిగత అజెండాల కారణంగా పవన్‌ని అణగదొక్కేయాలనో, లేదా సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనో ప్లాన్‌ చేస్తున్నారు. దాని కోసమే మీరు పరిశ్రమపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యాపారాన్నైనా మీ చేతుల్లోకే తీసుకుంటున్నారు కదా.. అలాగే సినిమా పరిశ్రమని సైతం ఆంధ్రా వరకూ మీరే తీసుకోండి. వెల్లంపల్లి, కొడాలి వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు చేయండి. వాళ్లు బాగా నటిస్తారు. ఆ నటన ముందు మేము ఏ మాత్రం సరిపోం. లేదంటే ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్‌ చేసేయండి. కొన్నిరోజులు నష్టపోతాం. వేరే దారి చూసుకుని మా సినిమాలు విడుదల చేస్తాం. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. యూట్యూబ్‌, ఓటీటీ ఎలా చూసుకున్న మాకు డబ్బులు వస్తాయి’’

‘‘చిరంజీవి పెద్ద మనిషి తరహాలో వెళ్లి జగన్‌తో మాట్లాడారు. దానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా స్పందించారు. దాన్ని నేను కాదనడం లేదు. కానీ జీవో ఇవ్వడానికి ఇంత ఆలస్యమేమిటి? పాత జీవోని అమలు చేయకుండా.. మధ్యలో మీరు తీసుకువచ్చిన జీవో చెల్లదని తెలిసి కూడా దాని ప్రకారమే టికెట్లు అమ్మడం ఏమిటి? ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వల్ల కల్యాణ్‌బాబు, లేదా మేము మీ వద్దకు వచ్చి బతిమలాడుకుంటానుకుంటున్నారా? అలా జరగదు’’

‘‘అఖండ’, ‘పుష్ప’ అదే ధరలకు ఆడాయి అంటున్నారు. కానీ, మీరు కనుక రేట్లలో సవరింపులు చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి. కాకపోతే వాళ్లు మాట్లాడలేకపోయారు. అది వాళ్ల వ్యక్తిగతం. అందరి హీరోలకు అది వర్కౌట్‌ కాదు. అందుకే మేము అడిగాం. చిరంజీవి లాంటి పెద్ద మనిషి.. హుందాతనాన్ని పక్కనపెట్టి, ఇండస్ట్రీ తరఫు నుంచి వెళ్లారు. ఆయన కేవలం హీరోల కోసం వెళ్లలేదు. కార్మికుల కోసం వెళ్లారు. ఎందుకంటే హీరోలు సినిమాలు చేయడం మానేస్తే ఎంతోమంది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటాయి’’

‘‘జగన్‌ గారూ.. ఇంకా రెండేళ్ల కాలం ఉంది. ఈ రెండేళ్లు అయినా పగా ప్రతీకారాలతో కూడిన పాలన మానేసి, మంచి పాలన చేయండి. మీ పాలన ఎలా ఉందో తెలియాలంటే ఒక్కసారి ప్రజల్లోకి రండి. మీ పాలనలో ఎంతమంది బాధపడుతున్నారో? ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు, అవన్నీ ఎవరి నుంచి వసూలు చేస్తున్నారు? మీరు మంచిగా పరిపాలించండి. మేము కూడా సంతోషిస్తాం. మిమ్మల్ని ఏమైనా అంటే... మీ మంత్రులు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. కానీ మేము అలా మాట్లాడటం లేదు. సినీ పరిశ్రమను ఒక పరిశ్రమగా గుర్తించండి. మాకూ ఫైనాన్స్‌లు వచ్చేలా చేయండి. అప్పుడు చెప్పండి ధరలు ఎలా పెట్టమంటారో..! కానీ మీరు ఎలాంటి సాయం చేయరు. కార్మికులు నాశనం అయిపోతుంటే పట్టించుకోరు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంతైనా సాయం అందుతోంది. మీరు అది కూడా చేయడం లేదు’’

‘‘సినిమా పరిశ్రమలోని అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. రాజకీయాలతో మనకు ఏం సంబంధం ఉండదు. మీరు భయపడకండి. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఎలా డబ్బు సంపాదించాలనే విషయాన్ని ఆలోచిద్దాం. మనం ధైర్యంగా, ఒక్కటిగా ఉంటే మనల్ని ఎవరూ ఏం చేయలేరు. మనం భయపడితే చిన్న కార్మికులు రోడ్డునపడతారు. ప్రభుత్వ తీరుపై గళమెత్తుదాం. అవసమైతే కోర్టుకువెళ్దాం. కొంచెం గట్టిగా ఫైట్‌ చేద్దాం. అలాగే మెగా అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే ఆవేశపడొద్దు. మీరు ఆవేశాన్ని దాచుకోండి. సమయం వచ్చినప్పుడు, ఉపయోగిద్దాం. ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు’’ అని నాగబాబు వివరించారు.

ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' వసూళ్ల మేనియా.. మూడురోజుల్లో రూ.100 కోట్లు

Last Updated : Feb 28, 2022, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.