ఈఎస్‌ఐ అవకతవకల్లో తన పాత్ర ఉందంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2016లో కేంద్రం సూచనల మేరకే టెలీ హెల్త్ సర్వీసెస్ సేవలను ఈఎస్‌ఐ కోసం పొందామని వివరించారు. ఏపీలో కంటే తెలంగాణలోనే ముందుగా దీన్ని ప్రారంభించారని...అందుకే మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని నోట్ పంపానని వివరించారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో దీనిని కేటాయించాలని తాను ఆదేశించలేదని స్పష్టం చేశారు. దురుద్దేశంతోనే ఓ వర్గం మీడియా తనపై అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ఈఎస్ఐలో అవకతవకలు.. రూ.70 కోట్ల అవినీతి..!