ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా దాడులు

రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్‌ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా అధికారులు దాడులు చేశారు. లక్షల రూపాయల్లో అనధికారిక నగదుతోపాటు.. అనుమతి లేకుండా కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రైవేటు సిబ్బందిని గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నగదు వసూలు చేసేందుకు అనధికారిక వ్యక్తులను నియమించుకున్నట్లు తనిఖీల్లో తేలింది.

acb-sleuths-raid-
acb-sleuths-raid-
author img

By

Published : Sep 3, 2020, 4:46 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అనిశా దాడులు

తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచీ రాత్రి వరకూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి తహసీల్దార్‌ కార్యాలయంలో... 30 పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వకుండా ఉంచినట్లు గుర్తించారు. స్పందన, మీ సేవ ద్వారా వచ్చిన ఫిర్యాదులు 2 నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తేల్చారు. 22 వేల 810 రూపాయల నగదు అనధికారికంగా ఉందని గుర్తించారు. విజయనగరం బాలాజీపేట తహసీల్దార్‌ కార్యాలయంలో... 95 పాస్‌బుక్‌లు లబ్ధిదారులకు ఇవ్వలేదని, 1857 ఫిర్యాదులు ఏ కారణం లేకుండానే తిరస్కరించినట్లు గుర్తించారు.

అనధికారిక సిబ్బంది...

విశాఖ కశింకోటలో... 941 ఫిర్యాదులు తిరస్కరిస్తే... తనిఖీల్లో 47 ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలు మాత్రమే లభ్యమైనట్లు తేల్చారు. నలుగురు ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా పనిచేస్తున్నారని కనిపెట్టిన ఏసీబీ అధికారులు... సిబ్బంది వద్ద ఉన్న లెక్కచూపని 27 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు కొయ్యగుడెంలో 12 వేల 797 ఫిర్యాదుల్లో అకారణంగా 706 ఫిర్యాదులు తిరస్కరించినట్లు అనిశా గుర్తించింది. అనధికారికంగా ఓ వ్యక్తి కార్యాలయంలో పని చేస్తున్నారని, సిబ్బంది వద్ద లెక్కతేలని నగదు 5 వేల 80 రూపాయలు ఉందని తేల్చారు.

2లక్షల 28వేలు స్వాధీనం...

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోని కారులో 2లక్షల28 వేల రూపాయల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన కారణం లేకుండా 8 వేల 85 ఫిర్యాదులు తిరస్కరించారని గుర్తించారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లెక్కచూపని 40 వేల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు... డబ్బులు వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. గుంటూరు జిల్లా రాజుపాలెం తహసిల్దార్ కార్యాలయంలో 4 వేల 510 రూపాయలు లెక్కతేలని సొమ్మును స్వాధీనం చేసుకున్న అనిశా అధికారులు... 102 పట్టాదారు పుస్తకాలు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ఉంచారని గుర్తించారు.

కంప్యూటర్ ఆపరేటర్​గా ప్రైవేట్ వ్యక్తి...

ప్రకాశం జిల్లా ఉలవపాడులో సిబ్బంది వద్ద అనధికారికంగా 40 వేల 752 రూపాయలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు... కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఓ ప్రైవేట్ వ్యక్తి పనిచేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. 350 ఫిర్యాదులు ఏ కారణం లేకుండానే తిరస్కరించారని నివేదికలో ప్రస్తావించారు. కర్నూలు ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది నుంచి 6 వేల 200 రూపాయల అనధికారిక సొమ్మును స్వాధీనం చేసుకున్న అనిశా అధికారులు... 170 ఫిర్యాదులు ఏ కారణం లేకుండానే తిరస్కరించినట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో... 10 ఫిర్యాదులకు లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తేల్చింది.

లబ్ధిదారులకు ఇవ్వలేదు...

అనంతపురం జిల్లా కుడేరులో... 37 ఈ-పాస్‌ బుక్‌లు లబ్ధిదారులకు ఇవ్వలేదని తేల్చారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 69 వేల 830 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కడపజిల్లా బద్వేలులో... ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలుచేస్తున్నట్లు గుర్తించిన అధికారులు... సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న 30 వేల 790 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పీలేరులో అనధికారిక సొమ్ము, ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ గుర్తించింది. 15 మంది స్టాంప్‌ వెండర్స్‌ను ఏకకాలంలో అదుపులోకి తీసుకుని... 3 లక్షల 37 వేల 340 రూపాయల లెక్కతేల్చని నగదును స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టామని, లెక్కతేలని సొమ్ముపై దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తామని అనిశా అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

రమేశ్​ ఆస్పత్రికి ఊరట...నోటీసును రద్దు చేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.