సంగం డెయిర్ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్ కు బెయిలు మంజూరు చేయాలని వారి తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను సీజ్ చేశారని.. పిటిషనర్లను అనిశా కస్టడీకి తీసుకొని విచారించిందని తెలిపారు. వీరు బెయిల్‌పై విడుదలైనా రికార్డులు తారుమారు చేసే అవకాశమే లేదన్నారు. గత నెల అరెస్టయిన వీరు...కొవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని, మళ్లీ జైలుకు వెళ్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కరోనా ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో వారిని కారాగారానికి తరలించడం మంచిది కాదని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. దీనిపై ఏజీని వివరణ కోరగా దస్త్రాలు ఇంకా స్వాధీనం చేసుకోలేదని, బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తులో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉందన్నారు. హైకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రతుల్ని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు
ఇదీ చదవండి: