ETV Bharat / city

పాన్​కార్డుతో ఆధార్ లింక్ చేశారా?... చివరి తేదీ ఇదేనండీ

మీ పాన్ కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేశారా? ఇంకా లింక్ చేయలేదా? మార్చి 31 వరకే గడువుంది. అప్పట్లోగా మీ పాన్ కార్డును ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాల్సిందే. లేకపోతే మీ పాన్ కార్డు పని చేయదు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అనుసంధానం చేయని పాన్‌కార్డులు పని చేయవని ఐటీశాఖ హెచ్చరిస్తోంది.

aadhaar card LINK WITH PAN
పాన్​కార్డుతో ఆధార్ లింక్ చేశారా?... చివరి తేదీ ఇదేనండీ
author img

By

Published : Mar 18, 2020, 12:39 PM IST

భారతదేశంలో 125.65 కోట్లు మంది (భారత విశిష్ఠ గుర్తింపు కార్డులు) ఆధార్ కలిగి ఉన్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ - యుఐడీఏఐ తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం దేశంలో 48 కోట్ల మందికిపైగా శాశ్వత ఖాతా సంఖ్య - పాన్‌ కార్డుదారులు ఉన్నారు. ఇందులో దాదాపు 44 కోట్ల పాన్‌ కార్డులు వ్యక్తిగతమైనవి కాగా మిగిలినవి ఇతర విభాగాలకు చెందినవిగా ఐటీశాఖ పేర్కొంటోంది.

మార్చి 31 చివరి తేదీ...

ఈ ఏడాది జనవరి చివరినాటికి 30.75 కోట్ల మంది తమ పాన్​ కార్డులను ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసుకోగా మరో 17.58 కోట్ల మంది చేసుకోలేదని ఐటీ అధికారుల తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన నెలన్నరలో మరో నాలుగు కోట్ల మంది అనుసంధానం చేసుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఇంకో మూడు నుంచి నాలుగు కోట్లు మంది అనుసంధానం చేసుకుంటారని భావించినా ఇంకో పది కోట్లు మంది పాన్‌కార్డుదారులు మిగిలిపోతారని అంచనా వేస్తున్నారు. నెలాఖరు నాటికి అనసంధానం పూర్తికాని కార్డుదారులకు చెందిన పాన్‌లు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పని చేయవని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్‌ 139(ఎ) ప్రకారం వాటిని రద్దు చేసే అధికారం తమకుందని అధికారులు చెబుతున్నారు.

పదివేలు జరిమానా...

ఎవరైనా నిర్దేశించిన గడువు తరువాత అనుసంధానం చేసుకునేందుకు ముందుకొస్తే వారికి పదివేలకు తక్కువ లేకుండా జరిమానా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగస్థులుగా ఉండి అనుసంధానం చేయనట్లయితే మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మూడేళ్ల డిగ్రీలోనే అప్రెంటిస్​షిప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.