ETV Bharat / city

బైక్‌పై జంట విహారయాత్ర.. నెలరోజుల్లో 10వేల కి.మీ ప్రయాణం - జగిత్యాల జిల్లాలో యువజంట బైక్‌ రైడింగ్‌

సాహసాలు చేయడం అంటే ఎవరికైనా ఇష్టమే. జీవితభాగస్వామితో కలిసి బైక్‌పై విహారయాత్రకు వెళ్లడం అదో మరచిపోలేని అనుభూతి. దేశంలో కొంతభాగాన్నైనా బైక్‌ ద్వారా చుట్టిరావాలన్న కలను నిజం చేసుకున్నారు తెలంగాణ జగిత్యాలకు చెందిన యువ జంట. నెల రోజులపాటు 7 రాష్ట్రాల్లో 10 వేల కిలోమీటర్లు పర్యటించారు.

Young couple Bike Ridin
బైక్‌పై జంట విహారయాత్ర
author img

By

Published : Dec 14, 2020, 8:59 AM IST

బైక్‌పై జంట విహారయాత్ర

తెలంగాణ జగిత్యాలకు చెందిన యువ దంపతులు బూసి విజయ్‌, వస్మిత... దేశంలోని పలు పర్యాటక కేంద్రాలను తిరగాలని నిర్ణయించుకున్నారు. నవంబర్‌ 10న జగిత్యాలలో ప్రారంభమైన వీరి యాత్ర... నెల రోజులపాటు 7 రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో సాగింది. రోజుకు 12 గంటలు ప్రయాణించిన ఈ జంట... రాత్రిళ్లు హోటళ్లో బస చేసేవారు. తమ ప్రయాణంలో చాలా ఇబ్బందులు, సవాళ్లను అధిగమించి గమ్యాన్ని చేరామని తెలిపారు.

యూట్యూబ్​లో చూసి...

ఇలాంటి సాహసయాత్ర చేయడానికి ఒక కారణం ఉందని ఈ జంట చెబుతోంది. విజయ్‌-శ్వేత అనే యువ జంట దేశంలోని అనేక ప్రదేశాలను సందర్శిస్తారని యూట్యూబ్‌లో చూసి తామూ ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. విజయ్‌-శ్వేత దంపతులను యూట్యూబ్‌లో అనుసరిస్తూ వీరి ప్రయాణం సాగింది. విజయ్‌-వస్మిత దంపతులకు మార్గమధ్యలో విజయ్‌-శ్వేత జంట కలిసింది. వీరంతా కొంత దూరం ప్రయాణించి... వారితో కొంత సమయం గడిపారు.

బైక్‌ రైడింగ్‌ తమకు మంచి అనుభూతిని ఇచ్చిందని ఈ యువదంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను చుట్టొచ్చినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.