ETV Bharat / city

తల్లి ఆఖరి చూపుకు నొచుకోని కానిస్టేబుల్‌

ఈ లోకంలో ఎలాంటి స్వార్థం లేకుండా పిల్లల కోసమే జీవితాన్ని అంకితం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అమ్మ మాత్రమే. మన జీవితంలో ఆమె పాత్ర వెలకట్టలేనిది. అలాంటి తల్లి చనిపోయి ఉంటే.. కడసారి చూసేందుకు ఓ కొడుక్కు అవకాశం లేకుండా చేసింది కరోనా.

Medchal District
తల్లి ఆఖరి చూపుకు నొచుకోని కానిస్టేబుల్‌
author img

By

Published : Apr 6, 2020, 6:30 PM IST

కన్నతల్లి కన్నుమూసినా ఆమెను చూడటానికి వెళ్లలేని పరిస్థితి ఓ కానిస్టేబుల్‌కు వచ్చింది. రవాణా సౌకర్యాలు లేని కారణంగా కదలలేక.. విషాదం ఎదురైన పరిస్థితుల్లోనూ దుఃఖాన్ని దిగమింగుతూ విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, మెట్టపల్లి గ్రామానికి చెందిన గౌరినాయుడు నాలుగేళ్లుగా మేడ్చల్​ జిల్లా మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

గౌరినాయుడు తల్లి ఎల్లమ్మ (48) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. అనార్యోగం కారణంగా శనివారం మృతి చెందింది. ఒకవైపు కరోనా భయం, మరోవైపు రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆలస్యమై అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సహచర పోలీసులు, స్టేషన్‌ ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్‌ అతడిని ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.