శాశ్వత ప్రాతిపదికన ఇచ్చే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మను ముద్రించడాన్ని ఆక్షేపిస్తూ గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వేమూరు గ్రామానికి చెందిన జడ రవీంద్రబాబు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యక్తిగతంగా ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి చిత్రాన్ని ముద్రించటం చట్ట విరుద్ధమని తన పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి: