- అమరావతి భూముల విక్రయానికి నిర్ణయం
నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
- ప్రజావేదిక కూల్చి మూడేళ్లు.. ఉండవల్లి వద్ద మరోసారి ఉద్రిక్తత
అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజావేదిక కూల్చి 3 ఏళ్లైన నేపథ్యంలో ఆ శిథిలాల వద్ద ఆందోళన చేసేందుకు వెళ్తున్న తెదేపా నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
- ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రోబెషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఆందోళనలో ఉన్న తమకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
- వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి
నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహమైన కొన్ని గంటలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన అతను రోడ్డుపై పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
- 'శివసేన బాలాసాహెబ్'గా శిందే వర్గం.. రెబల్ ఎమ్మెల్యేలపై ఠాక్రే చర్యలు
మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతున్న వేళ.. ఠాక్రే శివసేన, శిందే రెబల్ ఎమ్మెల్యేల బృందాలు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. ముంబయిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయిన శివసేన జాతీయ కార్యవర్గం 6 తీర్మానాలను ఆమోదించింది.
- ' ఆ బాధను.. ప్రధాని మోదీ భరించారు'
గుజరాత్ అల్లర్లపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని అన్నారు. మోదీకి క్లీన్చిట్ ఇవ్వడం శుభపరిణామం అని అన్నారు.
- భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత
ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. కిష్ ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా
బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,450గా ఉంది. కిలో వెండి ధర రూ.61,580గా ఉంది.
- 100 సిక్సర్లు.. 100 వికెట్లు.. తొలి టెస్టు క్రికెటర్‌గా రికార్డు
టెస్టుల్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణిస్తూ గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటికే 100కుపైగా వికెట్లు తీసిన స్టోక్స్.. ఇప్పుడు 100 సిక్సర్లు కూడా కొట్టి తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
- ఆసక్తిగా పృథ్విరాజ్ 'కడువా' టీజర్.. 'డీజే టిల్లు' సీక్వెల్ అప్డేట్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో పృథ్విరాజ్ 'కడువా', 'డీజే టిల్లు' సీక్వెల్, 'పరంపర' వెబ్‌సిరీస్, 'చార్లీ 777' చిత్రాల సంగతులు ఉన్నాయి.
TOPNEW: ప్రధాన వార్తలు @9PM - తెలుగు తాజా వార్తలు
.
9PM TOPNEWS