ETV Bharat / city

TOP NEWS: ప్రధానవార్తలు @9PM

....

author img

By

Published : Jul 28, 2021, 9:01 PM IST

TOP NEWS
ప్రధానవార్తలు
  • దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి దేవినేని ఉమకు కృష్ణా జిల్లా మైలవరం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దేవినేనిని రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి జూమ్ ద్వారా జడ్జి ఎదుట దేవినేనిని పోలీసులు హాజరుపరిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Tdp Leaders House Arrest: తెదేపా నేతల గృహ నిర్భంధం

దేవినేని ఉమను పరామర్శించేందుకు వెళ్తుండగా... కృష్ణా జిల్లా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు నిర్భంధించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గృహ నిర్బంధంలోనే ఉండాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • srisailam dam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM JAGAN CASES: ఇండియా సిమెంట్స్ కేసులోనూ వాదనలకు సిద్ధం కావాలి: కోర్టు

హైదరాబాద్‌ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ ఛార్జ్‌షీట్లపై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ వాదనలకు సిద్ధం కావాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​కు మరోమారు అమెరికా భారీ సాయం

కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్​కు మరోసారి సాయం ప్రకటించింది అమెరికా. 25 మిలియన్​ డాలర్లను అందించనున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెగసస్​పై ఆగని రగడ- దద్దరిల్లిన పార్లమెంట్​

పార్లమెంట్​ ఉభయసభలు విపక్షాల ఆందోళనలు, నినాదాలతో హోరెత్తాయి. సమావేశాల ఏడోరోజు కూడా విపక్ష సభ్యులు నిరసనలకు దిగటం వల్ల వాయిదాల పర్వం కొనసాగింది. ఆందోళనల మధ్యే బాలల న్యాయ సవరణ బిల్లు-2021కి ఆమోదం తెలిపింది రాజ్యసభ. లోక్​సభలో ప్రశ్నోత్తరాలు ఎలాంటి వాయిదా లేకుండా పూర్తి కావటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వారం రోజుల్లోనే 21% పెరిగిన కరోనా మరణాలు'

గడిచిన వారంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మృతుల సంఖ్య 21శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 8 శాతం పెరిగినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విమాన ప్రయాణం ఇక మరింత చౌక!'

ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్​ ఝున్​ఝున్​వాలా.. ఆకాశ ఎయిర్​ పేరుతో కొత్త ఎయిర్​లైన్స్​ను ప్రాంభించనున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా అత్యంత తక్కువకే టికెట్లు విక్రయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సత్తా చాటిన సింధు.. క్వార్టర్స్​కు పూజా రాణి

టోక్యో ఒలింపిక్స్​లో ఆరో రోజు భారత్​కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హాకీలో మహిళల జట్టు పరాజయం చెందగా.. బ్యాడ్మింటన్​లో సింధు ఆశలు రేకెత్తిస్తోంది. ఆర్చరీలో దీపికా ఫర్వాలేదనిపించింది. మొత్తంగా ఆరో రోజు ఫలితాలు ఇవే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ మరార్​​ చేతుల మీదుగా 'క్షీరసాగర మథనం' ట్రైలర్​

అనిల్ పంగులూరి దర్శకత్వం వహిస్తున్న 'క్షీరసాగర మథనం' సినిమా ట్రైలర్​ను గురువారం(జులై 29) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ నిర్మాత శరత్​ మరార్​ ఈ ట్రైలర్​ను రిలీజ్​ చేయనున్నారని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.