- రాజధాని కోసం హస్తినకు...
అమరావతి మహిళా ఐకాస నేతలు హస్తినకు బయల్దేరారు. దిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున... అన్ని పార్టీల నేతలను కలసి రాజధాని రైతుల ఆవేదనను తెలియజేస్తామని మహిళలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిన శేష వాహనంపై.. కోనేటి రాయుడి వైభవం
శేషశైలవాసుడు శ్రీ వెంకటేశ్వరుడు చిన శేషవాహనంపై కొలువుదీరాడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ స్వామి వైభోగం చూడటానికి రెండు కళ్లు సరిపోవు అంటారు.. అందుకే ఎక్కడెక్కడ నుంచో భక్తులు శ్రీసమేతుడైన శ్రీనివాసుడికి చేసే సేవలు చూసేందుకు తరలివస్తారు. కరోనా పుణ్యమా అని ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిపినప్పటికీ... ఏమాత్రం తగ్గని కోనేటి రాయుడి వైభోగాన్ని మీరూ చూసి తరించండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 55 మంది సలహాదారులు అవసరమా ?
రాజకీయ స్వార్థం కోసమే వాసుపల్లి గణేశ్ తెదేపాకు ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వాటి నుంచి దృష్టి మరల్చడానికే ఒక్కొక్క ఎమ్మెల్యేను లాగుతున్నారని ఆరోపించారు. 55 మంది సలహాదారులు జగన్‌కు ఏం సలహాలు ఇస్తున్నారని...వారు అవసరమా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చెట్టుని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి..
కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగింది. ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా వీరిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వ్యవసాయ బిల్లులను ఆమోదించొద్దని రాష్ట్రపతికి వినతి'
పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను.. తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను విన్నవించారు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్. పునఃపరిశీలనకు వాటిని మళ్లీ పార్లమెంటుకు పంపాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వ్యవసాయ బిల్లులు.. రైతులకు డెత్ వారెంట్లు'
వ్యవసాయ బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రభుత్వం రైతులకు డెత్ వారెంట్లు జారీ చేసిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని పేర్కొన్నారు రాహుల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సోమవారం నుంచి పరుగులు పెట్టనున్న క్లోన్ ట్రైన్స్'
రైల్వే ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్ మేరకు 40 ప్రత్యేక క్లోన్ ట్రైన్స్‌ను సోమవారం నుంచి నడపనుంది రైల్వే శాఖ. రద్దీ ప్రాంతాలలో నడిచే ఈ రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ సెప్టెంబర్ 19 నుంచే ప్రారంభమయ్యాయి. పేరెంట్ రైళ్లతో పోలిస్తే.. ఈ క్లోన్ ట్రైన్స్ దాదాపు 3 గంటల ముందుగానే గమ్యం చేరనున్నాయని, అత్యవసర ప్రయాణాలు చేపట్టే వారికి వరంగా మారనున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆస్ట్రేలియాలో 3 నెలల్లో కనిష్ఠ కేసులు నమోదు
ప్రపంచ దేశాలపై కరోనా ప్రతాపం కొనసాగుతోంది. మొత్తం కేసులు 3 కోట్ల 10 లక్షలు దాటాయి. మరణాల సంఖ్య 9 లక్షల 62 వేలను అధిగమించింది. అయితే రికవరీలు 2 కోట్ల 26 లక్షలు దాటడం ఊరట కలిగించే అంశం. ఆస్ట్రేలియాలో 3 నెలల్లో ఇవాళే కనిష్ఠ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తొలి విజయం ఎవరిది?
దుబాయ్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. విజయం దక్కించుకోవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్ లైవ్ అప్డేట్స్ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
- బుల్లితెరపై మరో సర్ప్రైజ్కు రానా రెడీ..!
'వై ఆర్ యూ?' అనే కామెడీ షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు కథానాయకుడు రానా. దీని టీజర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.