ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM - 9ఏఎం టాప్​న్యూస్​

..

9AM TOPNEWS
ప్రధానవార్తలు @9AM
author img

By

Published : Aug 10, 2022, 8:58 AM IST

  • '‘గాలి’ అడిగితే కాదంటామా'.. ఏపీ పరిధిలో మళ్లీ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం

ఓబులాపురం మైనింగ్ కంపెనీ.....ఒకప్పుడు తెలుగునాట మారుమోగిన పేరు. వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ వ్యాపారానికి అడ్డా ఓఎంసీ.. సీబీఐ కేసుల అనంతరం మూతపడిన ఈ గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. అన్నయ్య గాలి జనార్దనరెడ్డి అడగటమే ఆలస్యం.. తమ్ముడు తనవంతుగా సహకారం అందించేందుకు మరోసారి సిద్ధమయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'గ్రూప్‌-1లో గోల్‌మాల్‌ జరిగింది'... హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలు

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయన్న కేసులో కొందరు అభ్యర్థులు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై... కోర్టుకు ఆధారాలు సమర్పించారు. అదనపు అఫిడవిట్‌ ఆధారంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టెట్‌ ఎస్‌ఏ ఆంగ్ల పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పేపర్‌-2ఏ స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) ఆంగ్ల పరీక్షపై మంగళవారం అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఎస్‌ఏ ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రంలో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, పెడగాజీని తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క ఆంగ్లంలోనే ఇచ్చారు. 30 మార్కులకు ఇచ్చిన ఈ విభాగంలో ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సకాలంలో సాగునీరు అందించాలి: మాజీ మంత్రి పరిటాల సునీత

జలాశయాలు నిండిన క్రమంలో సకాలంలో సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీసత్యసాయిజిల్లా రామగిరి మండలంలోని ముత్యాలంపల్లి, వెంకటాపురం గ్రామాల్లోని తన సొంత పొలంలో మంగళవారం ఆమె వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కూలీలతో కలసి వరినాట్లు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మహా' కొత్త కూటమిలో లుకలుకలు.. రెండు నెలలు కాకముందే ఇలా..!

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా, అసమ్మతి శివసేన కూటమి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాఠోడ్​కు పదవి ఇవ్వడంపై భాజపా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, రాఠోడ్​ను మంత్రివర్గంలోకి చేర్చుకోవడాన్ని సీఎం శిందే సమర్థించుకున్నారు. కూటమి ఏర్పడి రెండు నెలలు కాకముందే ఇలా లుకలుకలు బయటపడటం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బికినీ ధరించిన ప్రొఫెసర్‌.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం

బికినీ ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెట్టిన కారణంగా ఓ మహిళా ప్రొఫెసర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. యూనివర్సిటీకి అపార నష్టాన్ని కలిగించారని ఆక్షేపిస్తూ నష్టపరిహారంగా రూ.99కోట్లు కట్టాలంటూ ఆమెను వర్సిటీ అధికారులు ఆదేశించారు. గతేడాది అక్టోబర్‌లోనే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పుతిన్ ఆక్రమణ యత్నాలకు గండి.. రష్యాపై గెరిల్లా దళాల పోరు!

ఉక్రెయిన్​లోని తూర్పు ప్రాంతాన్ని తమలో కలిపేసుకోవాలన్న రష్యా ప్రయత్నాలు ఫలించడం లేదు. గెరిల్లా దళాలు రష్యాను ముప్పతిప్పలు పెడుతున్నాయి. రష్యా అనుకూల అధికారులను హత్య చేస్తున్నాయి. అదేసమయంలో ఉక్రెయిన్ సైన్యానికి కీలక సమాచారం అందించి.. గురి తప్పకుండా దాడి చేసేలా పురిగొల్పుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆర్థిక నేరగాళ్లకు చెక్‌.. ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే!

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ.. ఇలా దేశంలో ఆర్థిక నేరగాళ్లకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారెందరో. వారు చేసిన మోసం వెలుగుచూసేలోపే వారు విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి విమానయాన సంస్థా విదేశీ ప్రయాణికుల వివరాలను కస్టమ్స్‌ అధికారులకు ఇవ్వాలని స్పష్టంచేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ అథ్లెట్లకు ఆకాశమే హద్దు.. కష్టాల కడలి దాటి.. పతకాలను ముద్దాడి!

కామన్వెల్త్‌ క్రీడలు ముగిశాయి. అందులో మన దేశం నుంచి 61 మంది పతక విజేతలు. వీళ్లందరూ ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వీళ్లందరి జీవితం పూల పాన్పేమీ కాదు. ఒకరు రైతు బిడ్డ.. ఇంకొకరు ఛాయ్‌వాలా.. ఒకరు మూటలు మోశారు.. మరొకరు గడ్డి కోశారు.. ఒకరికి తండ్రి లేడు.. మరొకరికి చేతుల్లో డబ్బు లేదు! అందరూ మనలాంటి వాళ్లే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అప్పుడు చాలా బాధేసింది.. హృతిక్​, అక్షయ్ ధైర్యమిచ్చారు!: నితిన్

హీరో నితిన్ నటించిన కొత్త సినిమా 'మాచర్ల నియోజకవర్గం'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు తెలిపారాయన. కెరీర్​లో తాను ఎదుర్కొన్న విమర్శలు, ఆ సమయంలో ఎవరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లారు సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.