ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM - ఏపీ ప్రధానవార్తలు

..

9AM TOPNEWS
ప్రధానవార్తలు @9AM
author img

By

Published : Aug 4, 2022, 8:58 AM IST

  • పారిశ్రామిక ప్రమాదాలపై ఉదాసీనత.. కమిటీల ఆర్భాటం తప్ప, నివేదికల ఊసేది !

పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్వడంలేదు. ప్రమాదం జరిగినప్పుడు విచారణ కమిటీల ఆర్భాటం తప్ప.. అనేక సందర్భాల్లో అసలు ఆ నివేదికల్నిబహిర్గతం చేయలేదు. మిగతాచోట్ల ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా తీసుకోవాల్సిన చర్యలు,.. సిఫార్సులను ఆచరణలో పెట్టడంలేదు. ఈ ఉదాసీన వైఖరే ఇబ్బందికరంగా మారుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వం షాక్​.. వారి పింఛన్లు పీకేశారు !

పొరుగు సేవల ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం షాకిచ్చింది. అమ్మఒడి, కాపు నేస్తం, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్ని ఇప్పటికే నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పింఛన్లకూ కత్తెరేసింది. ఆదాయ పరిమితి నిబంధన తెర మీదకు తెచ్చి.. ఆగస్టు నెలలో వారి కుటుంబ సభ్యుల పింఛన్లు నిలిపేసింది. 10 ఏళ్లుగా వస్తున్న పింఛన్లు కూడా ఎగిరిపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీల ప్రమాణం

నేడు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు కొత్త జడ్జీలు ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం..

చిత్తూరు జిల్లా పలమనేరు టెర్రకోట పోటరీ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. వారు తయారు చేసిన కళా ఖండాలు నూతన పార్లమెంట్ భవనంలో అలంకరణ, ప్రదర్శనకు ఎంపికయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి టెర్రకోట పోటరీ కళాకారులు పోటీ పడగా.. రాజస్ధాన్, పశ్చిమ బంగాల్‌, ఆంధ్రప్రదేశ్ కళాకారులు రూపొందించిన వాటిని మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కీలక తీర్పుల్లో భాగస్వామి... తర్వాతి సీజేఐ ఈయనే

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ నెల 26 పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజున (ఆగస్టు 27న) 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ నియమితులవుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్యాంక్​ను దోచుకున్న బాలుడు.. క్షణాల్లో రూ.35 లక్షలు మాయం

పంజాబ్​ పటియాలాలోని స్టేట్ బ్యాంక్​ నుంచి రూ.35 లక్షలు కాజేశాడు ఓ బాలుడు. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో కూడిన బ్యాగును పట్టుకుని క్షణాల్లో మాయమయ్యాడు. సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిటన్​ ప్రధాని ఎన్నిక ఆలస్యం.. గెలుపు తనదేనంటోన్న సునాక్​!

యావత్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బ్రిటన్​ ప్రధానమంత్రి ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సైబర్ హ్యాకర్ల కారణంగా ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత రిషి సునాక్‌.. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్పైస్​జెట్​లో వాటా విక్రయం.. వారితో సంప్రదింపులు.. దూసుకెళ్లిన షేరు

స్పైస్​జెట్ ప్రమోటరు అజయ్ సింగ్ సంస్థలో ఉన్న తన వాటాలో కొంతభాగాన్ని విక్రయించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఓ సంస్థ స్పైస్​జెట్​లో 24 శాతం వాటా కొనేందుకు సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిధుల సేకరణ యత్నాలు ప్రారంభమయ్యాయన్న సంకేతాలతో స్పైస్​జెట్ షేరు దూసుకెళ్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జూడోలో రజతం.. వెయిట్​ లిఫ్టింగ్​, హైజంప్​లో కాంస్యాలు

కామన్వెల్త్‌ క్రీడల్లో తూలిక మాన్‌ అదరగొట్టింది. జూడోలో దేశానికి మరో రజతాన్ని అందించింది. అంచనాలను మించి.. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆమె.. తుదిపోరులో తడబడింది. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌, హైజంప్​లోనూ భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఇక, స్క్వాష్‌ సింగిల్స్‌లో కాంస్యంతో సౌరభ్‌ చరిత్ర సృష్టించాడు. జోరు మీదున్న బాక్సర్లు సెమీస్‌ చేరి పతకాలు ఖాయం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?'

"కొన్ని చిత్రాలను థియేటర్లోనే చూడాలి. 'సీతారామం' థియేటర్లోనే చూడాల్సిన సినిమా" అన్నారు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం హైదరాబాద్‌లో 'సీతారామం' ముందస్తు విడుదల వేడుక జరిగింది. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.