- ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు.. గెలుపుపై పార్టీల ధీమా
Assembly elections 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ భద్రతా మధ్య, కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలట్లు లెక్కించి.. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతారు.
- పీఆర్సీ సిఫార్సులే చేయగలదు.. వాటిని ఆమోదించడం.. తిరస్కరించడం ప్రభుత్వ పరిధిలోనిది
High Court on PRC Petitions: పీఆర్సీకి చట్టబద్ధత లేదని, ఆ కమిషన్ సిఫార్సులే చేయగలదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటరు వేసింది. ఆ సిఫార్సులను అంగీకరించాలా, లేదా అనేది ప్రభుత్వ విచాక్షణాధికారం అని తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
- Amaravathi News: కొత్త రాజధానిలో సంస్థల ఏర్పాటు బాధ్యత కేంద్రానిది కాదా?
Negligence on Capital Amravati: రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థలాలు తీసుకుని నిర్మాణాలు మొదలుపెట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 18 ప్రభుత్వ రంగ విభాగాలు భూములు తీసుకోగా.. కేవలం ఒక్కటంటే ఒక్కటే అమరావతిలో నిర్మాణం మొదలుపెట్టింది.
- 'విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఎలాంటి నిర్దిష్ట కాలవ్యవధి లేదు'
Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన కాలవ్యవధి లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అలాగే రాయగడ రైల్వే డివిజన్ తూర్పుకోస్తా రైల్వే జోన్లో అంతర్భాగంగా ఉంటుందని పేర్కొంది.
- Movie Tickets: సినిమా టికెట్లపై అప్పుడలా..ఇప్పుడిలా..ఎందుకిలా?
CM jagan Comments on Movie Tickets: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని సమర్థించుకుంటూ.. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు గతంలో రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే సినిమా పెద్దలు వచ్చి కలిశాక టికెట్ ధరల్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలు వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు హల్చల్ చేస్తున్నాయి. ‘అంటే మూడు నెలల్లోనే రాష్ట్రంలోని పేదలంతా ధనవంతులైపోయారన్న మాట’ అని పలువురు వ్యంగ్యబాణాలు సంధిస్తున్నారు.
- JNTUK Convocation: 'అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయ విద్య'
JNTU-Kakinada convocation: జాతీయ విద్యా విధానం- 2020.. దేశీయ విద్యను ప్రపంచస్ధాయికి తీసుకెళ్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతదేశాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో మరింత సమగ్రమైన, దూరదృష్టి గల విద్యా విధానాన్ని మనం అమలు చేసుకుంటున్నామని చెప్పారు. జేఎన్టీయూ- కాకినాడ 8వ స్నాతకోత్సవ కార్యక్రమంలో కులపతి హోదాలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.
- ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం.. ప్రసూతి ఆసుపత్రి ధ్వంసం
Russia attack on Hospital: ఉక్రెయిన్‌పై ఎడాపెడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆసుపత్రులూ, శ్మశానాలనూ వదలటం లేదు. మేరియుపోల్‌లోని ఓ ప్రసూతి ఆసుపత్రి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద పిల్లలు సహా పలువురు రోగులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్వీట్ చేశారు. మరోవైపు.. ఉక్రెయిన్ జాతీయవాదులు పౌరుల తరలింపులను అడ్డుకుంటున్నారు పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
- Boxer Nikhat: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు నిఖత్
Boxer Nikhat world championships: తెలుగు తేజం యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించింది. మే 6న ఇస్తాంబుల్‌లో ఆరంభమయ్యే మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 52 కేజీల విభాగంలో బరిలో దిగనుంది.
- Radheshyam: 'ప్రభాస్ నన్ను చాలా ప్రోత్సహించారు'
prabhas radheshyam producer : కృష్ణంరాజు నట వారసత్వాన్ని ప్రభాస్ పుణికి పుచ్చుకున్నారు. తెరపైనే కాదు.. తెరవెనుక ఆయన వారసులు సత్తా చాటేందుకు ముందుకొస్తున్నారు. కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీధ నిర్మాతగా 'రాధేశ్యామ్'తో ప్రయాణాన్ని ఆరంభించారు. ప్రమోద్, వంశీతో కలిసి ఆమె నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాయిప్రసీధ చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..