- Debt: ఉద్యోగుల వాటాపైనా అప్పా?.. అదెలా సాధ్యం..?
Debt: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కొత్తగా అదనపు అప్పు తీసుకునేందుకు ఇచ్చిన అనుమతులు, కారణాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సీపీఎస్ వాటా నుంచి ఎన్‌ఎస్‌డీఎల్‌లో జమ చేసేది రూ.2,660 కోట్లు, సచివాలయ ఉద్యోగుల వాటా కలిపినా రూ.3,060 కోట్లు ఉంటుదని లెక్కలు చెబుతున్నాయి. మరి కేంద్రం రూ.4,203 కోట్ల అప్పు ఇవ్వడం ఎలా సాధ్యం? అన్న ప్రశ్నలు ఉద్యోగ సంఘాల విస్మయానికి గురిచేస్తున్నాయి.
- ఆ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులివ్వడంలేదు:కేంద్ర రైల్వే మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో కాస్ట్ షేరింగ్ రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించాల్సి ఉందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటికే రూ.1,798 కోట్ల పెండింగ్ ఉందని తెలిపారు. బుధవారం లోక్‌సభలో వైకాపా ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు.
- అంతరిక్షంలోకి బాలికల ప్రతిభ... ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి
దేశంలోని 750 మంది విద్యార్థినుల ప్రతిభతో ‘ఆజాదీశాట్’ అనే ఉపగ్రహం తయారవుతోంది. దీన్ని 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు హెక్సావేర్ టెక్నాలజీస్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు సమకూర్చింది. చెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది.
- తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికను రద్దు చేయండి:హైకోర్టులో వ్యాజ్యం
తిరుపతి టౌన్ బ్యాంక్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
- ఎంపీల 50 గంటల నిరాహార దీక్ష.. తిండి, నిద్రా అంతా అక్కడే..
Opposition Leaders Protest: సస్పెన్షన్‌కు గురైన 20 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల దీక్షకు దిగారు. వీరు బుధవారం రాత్రంతా అక్కడే ఉండి నిరసన తెలిపారు. నిరసన శిబిరంలో ఉన్నవారి కోసం బుధవారం ఉదయం ఇడ్లీ-సాంబార్‌ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సమకూర్చగా మధ్యాహ్నం పెరుగన్నాన్ని అదే పార్టీ ఏర్పాటు చేసింది. రాత్రికి రోటీ, పన్నీర్, చికెన్ తండూరీని తృణమూల్ సమకూర్చింది.
- ఈడీ అధికారాలపై 'సుప్రీం' కీలక తీర్పు.. ఇక వారికి కష్టమే!
SC Judgement On PMLA: ఈడీ అధికారాలను తప్పుపడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కార్తీ చిదంబరం, మోహబూబా ముఫ్తీ వంటి నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అధికారాలను న్యాయస్థానం సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కొట్టిపారేసింది. సుప్రీం తీర్పుపై అధికార భాజపా హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ నిరాశ వ్యక్తం చేసింది.
- అర్ధంతరంగా ముగిసిన రిషి, ట్రస్ టీవీ డిబేట్.. కారణం ఇదే..
Rishi Sunak Liz Truss debate: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ మంగళవారం టాక్‌టీవీ చేపట్టిన డిబేట్లో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేట్ మెకాన్ అనారోగ్యంగా కారణంగా కిందపడిపోయారు. దీంతో టాక్‌టీవీ యాజమాన్య సంస్థ ఈ డిబేట్‌ను ఇక్కడితో ఆపేస్తున్నామని ప్రకటించింది. మరోవైపు రిషి సునాక్ ప్రచారంలో వ్యూహం మార్చారు.
- రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం.. మరోసారి 'ఫెడ్' వడ్డీ రేట్లు పెంపు
fed interest rate hike: కీలక వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో రేట్ల పెంపునకే మొగ్గు చూపింది.
- కామన్వెల్త్ క్రీడలు వచ్చేశాయ్.. పోటీలే పోటీలు.. పతకాల వేటలో భారత అథ్లెట్లు!
Commonwealth Games: 72 దేశాలు.. 5 వేల మందికి పైగా క్రీడాకారులు.. 20 క్రీడాంశాలు.. 12 రోజుల పాటు పోటీలే పోటీలు.. క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ గేమ్స్ నేటి (గురువారం) నుంచే జరగనున్నాయి. అథ్లెట్ల పతక ఆరాటాలతో అభిమానుల విజయ కేరింతలతో క్రీడా వినోదం మరోస్థాయికి చేరనుంది.
- షూటింగ్స్ ఎప్పుడో పూర్తయినా.. రిలీజ్‌లపై క్లారిటీ లేదే!
కరోనా మహమ్మారి దెబ్బకు రెండేళ్ల పాటు సినీ పరిశ్రమ క్యాలెండర్ తారుమారయ్యింది. ఆ తర్వాత మెల్లమెల్లగా చిత్రీకరణ పూర్తయిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పలు హీరోల చిత్రాలు.. ఇంకా రిలీజ్ తేదీని ఖరారు చేసుకోలేదు. ఆ సినిమాల వివరాలను ఓ సారి చూద్దాం రండి..
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM
..
ప్రధాన వార్తలు @ 9 AM