ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

..

author img

By

Published : May 21, 2022, 9:02 AM IST

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM
  • ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ డ్రైవర్​ది హత్యా..? ప్రమాదమా..?
    కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపింది. అది కూడా ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్​గా పని చేస్తున్న వ్యక్తిదే కావడం.. నిన్న ఎమ్మెల్సీనే సదరు డ్రైవర్​ను బయటకు తీసుకెళ్లడంతో.. ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా.. అవసరమైతే వారిని ఒప్పిస్తా'
    వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు భాజపాను సైతం ఒప్పిస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ఆ పార్టీ అధిష్టానంతో దీనిపై చర్చిస్తానని తెలిపారు. గతంలో అమరావతి వి।షయంలో అమిత్‌షాను ఒప్పించిన అనుభవం తనకు ఉందని పవన్ గుర్తుచేశారు. పొత్తుల విషయంలోనూ అదే విధంగా ఒప్పించగలనన్న నమ్మకం ఉందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • TDP Mahanadu : తెలుగుదేశం మహానాడుకు జోరుగా ఏర్పాట్లు.. రెండేళ్ల తర్వాత..
    తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. కరోనా దెబ్బకు రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో వేడుక జరగ్గా... ఈసారి ఒంగోలులో కార్యకర్తలు, ప్రజల సమక్షంలోనే నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం ఏర్పాటుచేయడంతో... మహానాడు మరింత ప్రత్యేకత సంతరించుకోనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Vishwaroop: "జూన్ మొదటి వారంలోనే.. గోదావరి డె‌ల్టాకు సాగునీరు"
    Minister Vishwaroop: జూన్ మొదటి వారంలోనే గోదావరి డె‌ల్టాకు సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రి పినపే విశ్వరూప్ తెలిపారు. తుపాన్‌ల నుంచి పంటను కాపాడుకునేందుకు ముందే నీటిని విడుదల చేస్తామన్నారు. ఈలోగా గోదావరి డెల్టాలో కాలువల మరమ్మతులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారంలో ధాన్యం బకాయిలు సైతం చెల్లిస్తామని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఘోర ప్రమాదం.. చెట్టుకు వ్యాన్​ ఢీకొని 7 మంది దుర్మరణం
    వేగంగా ప్రయాణిస్తున్న ఓ వ్యాన్​ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో 7 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని ధర్వాద్​ ప్రాంతంలోని బాదా గ్రామంలో జరిగింది. నిశ్చితార్థ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి సుమారు 1 గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్​ వ్యాపారి దారుణ హత్య..
    Finance Owner Murder: పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్ వ్యాపారిని ఆరుగురు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ వైరస్​తో ఒకే ఏడాదిలో లక్ష మంది చిన్నారులు మృతి
    కొద్ది నెలలుగా వైరస్ అంటే.. కరోనానే అనే భావన ఉండిపోయింది. ఎంతో మంది దీనికి బలయ్యారు. కానీ ఓ సాధారణ వైరస్.. పెద్ద సంఖ్యలో చిన్నారులను పొట్టనబెట్టుకుంది. ఒకే ఏడాదిలో లక్ష మందిని బలితీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.30,307 కోట్లు డివిడెండ్​!
    RBI Dividend: ఆర్​బీఐ.. రూ. 30,307 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయనుంది. ఈ విషయంపై శుక్రవారం ఆర్బీఐ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ బోర్డు ఆకస్మిక రిస్క్ బఫర్‌ కింద 5.5 శాతం నిధులు తమ వద్దే ఉంచాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'థామస్‌ కప్‌లో భారత జట్టుది అద్భుత ప్రయాణం'
    కిదాంబి శ్రీకాంత్‌.. సాత్విక్‌ సాయిరాజు.. ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ సాధించిన భారత బృందంలో కీలక సభ్యులైన ఈ ఇద్దరూ తెలుగు వాళ్లే. బ్యాంకాక్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న ఈ ఇద్దరూ తాము సాధించిన చారిత్రక విజయంపై 'ఈనాడు- ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అనిల్‌ రావిపూడితో పనిచేస్తే ఒత్తిడి ఉండదు'
    అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన 'ఎఫ్‌3' సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను పంచుకున్నారు మ్యూజిక్​ డైరెక్టర్​ దేవీశ్రీ ప్రసాద్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.