ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ ముఖ్యవార్తలు

.

9 PM TOP NEWS
ప్రధాన వార్తలు@9pm
author img

By

Published : Jul 11, 2020, 9:02 PM IST

  • విస్తరిస్తోన్న మహమ్మారి

రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1813 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కృష్ణమ్మ పరవళ్లు

ఈ సీజనులో తొలిసారిగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది దిగువకు నీటిని విడుదల చేశారు. ఆరు నుంచి ఏడు క్యూసెక్కుల వరకు నీటిని వదులుతున్నారు. దిగువ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ' రాజకీయంగా వేధిస్తున్నారు'

పితాని కుటుంబాన్ని రాజకీయంగా వేధిస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు సీఎం జగన్ తన అవినీతి బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సోమవారం స్పష్టత!

కరోనా విజృంభిస్తున్న వేళ ఏపీ ఎంసెట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మోదీ ఎందుకు భయపడుతున్నారు?

కొవిడ్​-19పై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్​ నిధి అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. దాతల పేర్లు పంచుకోవటానికి మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నలుగురి దారుణ హత్య

ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా వరుడి కుటుంబ సభ్యుల్లో నలుగుర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక రాయ్​చుర్​ జిల్లా సింధనూర్​లో జరిగింది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జాతివిద్వేష వ్యూహం!

అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి అధిరోహించడానికి ట్రంప్ ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. శ్వేతజాతీయుల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి విద్వేష వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ' ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్​ చేరాలి'

కరోనా ఔషధాలు, వ్యాక్సిన్​ అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ అన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్​ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'విజేతకు, ఓడిన వారికి అదొక్కటే తేడా'

ప్రపంచస్థాయి టోర్నీ ఫైనల్లో ప్రత్యర్థి కన్నా ఒక్క శాతం అత్యుత్తమ ప్రదర్శనే విజేతగా నిలబెడుతుందని అన్నారు మాజీ ఒలింపియన్​ అభినవ్​ బింద్రా. శనివారం ఈఎల్​ఎమ్​ఎస్ ఫౌండేషన్​, అభినవ్​ బింద్రా ఫౌండేషన్​ కలిసి అత్యత్తమ స్థాయి లీడర్​షిప్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'మహానటి'కి సామ్ సవాల్ ​​

టాలీవుడ్​ సీనియర్​ హీరో నాగార్జున విసిరిన 'గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​'ను స్వీకరించిన హీరోయిన్​ సమంత తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. అనంతరం కథానాయికలు కీర్తి సురేష్, రష్మికకు ఛాలెంజ్ విసిరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.