- 20వేల కోట్లు ..30 లక్షల కుటుంబాలు
ఆగస్టు 15 నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ తెలిపారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన... పట్టాల పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చూడాలని సూచించారు. స్టాక్ యార్డుల్లో భారీ ఎత్తున నిల్వలు ఉంచాలని దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్ అయ్యారు. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మా పార్టీలోనూ వెన్నుపోటుదారులు
వైకాపా తరఫున గెలిచి... పార్టీతో పాటు సీఎం జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు. కొందరు నేతలు వైఎస్ఆర్ను పొగుడుతూనే ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ సరికొత్త రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ఎన్జీటీ కమిటీలు
విశాఖ పరవాడ, కర్నూలు నంద్యాలలో ఇటీవల గ్యాస్ లీకేజీ ఘటనలపై ఎన్జీటీ కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రమాద ఘటనలపై మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు మృతుల కుటుంబాలకు, బాధితులకు నష్టపరిహారం అందించాలని సూచించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- త్వరలోనే మార్గదర్శకాలు
సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారి వల్ల ఆగిపోయిన షూటింగ్‌లను తిరిగి ప్రారంభించేందుకు మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడించనుంది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా దెబ్బ- ఏళ్ల శ్రమ వృథా!
కరోనా ఉద్ధృతితో ఏకకాలంలో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. జనజీవనంపై లాక్డౌన్ ఎనలేని ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం అన్‌లాక్ దశ మొదలైనప్పటికీ.. కొన్ని విషయాల్లో కరోనా దీర్ఘకాల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- హాంకాంగ్‌కు టిక్‌టాక్ గుడ్‌బై
భారత్‌లో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హాంకాంగ్‌లో మాత్రం తనంతటతానే ఆ దేశం నుంచి బయటకు వస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. హాంకాంగ్‌పై చైనా జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా పంజా
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. రష్యాలో కొత్తగా 6 వేల కేసులు బయటపడ్డాయి. మెక్సికోలో 5 వేలు, పాకిస్థాన్‌లో 3 వేలు, ఇరాన్లో 2 వేల మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. చైనా, దక్షిణకొరియాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పర్మినెంట్ బాస్
భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి చెప్పిన చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్.. అతడు రానున్న పదేళ్లలో తమ ఫ్రాంచైజీకి యజమాని అవుతారని తెలిపారు. 'తలా' అని మహీని పిలవడం వెనకున్న కారణాన్ని వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ప్రముఖ నిర్మాత మృతి
బాలీవుడ్ పలు విజయవంతమైన చిత్రాలను తీసి దర్శకుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న హరీష్ షా మరణించారు. అయితే గొప్ప నిర్మాతను కోల్పోయామని, పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి