- రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,285కు చేరింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై అనిశా విచారణ ముగిసింది. అచ్చెన్నను ఇవాళ నాలుగున్నర గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. మరోవైపు అచ్చెన్న రిమాండ్ జులై 10 వరకు కోర్టు పొడిగించింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎస్పీవై పరిశ్రమలో గ్యాస్ లీకేజీ..ఒకరు మృతి
నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకై ఒకరు మరణించగా... సిబ్బంది ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'కేంద్రమంత్రి ప్రకటన అవాస్తవం'
వైకాపా సర్కార్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఖండించారు. కేంద్రం 2 రూపాయల 70 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తోందన్న ప్రకటన అవాస్తవమని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పీవీ' ప్రధాని పదవికే వన్నె
పదవులు రావడం గొప్పకాదు. ఆ పదవీకాలంలో పదికాలాల పాటు గుర్తుండిపోయేలా పాలించడం గొప్ప. ప్రధానిగా పీవీ నర్సింహారావు అదే చేశారు. ఆయన పదవి చేపట్టే నాటికి మునిగిపోయే నావలా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన మార్క్ పాలనను అందించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- కుట్ర భగ్నం
పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రోద్బలంతో దేశ రాజధానిలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తున్న ముగ్గురు ఖలిస్థాన్ సానుభూతిపరులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆ కంపెనీలతో జాగ్రత్త'
సామ్రాజ్యవాద కాంక్షతో ఉన్న చైనా... సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో చైనా గురించి అమెరికా వెల్లడించిన మరో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అమెజాన్ అధినేత ఓ కాపీ క్యాట్'
అమెరికాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలలో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరి రంగాల్లో వారు అద్భుతంగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరి మధ్య ప్రస్తుతం చిచ్చు రగులుతోందా.? అంటే అవునంటున్నారు కొందరు విశ్లేషకులు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- సెహ్వాగ్ ఇంటిపై మిడతల దండు
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై మిడతల దండు దాడి చేసింది. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడీ మాజీ ఓపెనర్. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
- ముహూర్తం ఖరారు!
టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్‌కు ఇటీవలే నిశ్చితార్థమైంది. తాజాగా కరోనాతో వాయిదా పడ్డ అతడి వివాహం గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. జులైలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేటుగా ఏర్పాటు చేయనున్న వేడుకలో ఈ హీరో పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.