- Jagan Delhi Tour: నేడు దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ
ముఖ్యమంత్రి జగన్ నేడు దిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. హోంమంత్రితో భేటీ ఆధారంగా మిగిలిన కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులతో నేడు లోకేశ్ సమావేశం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. గురువారం ఉదయం 9 గంటలకు ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. భౌతిక మూల్యాంకనం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందనే అంశంపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- krishna water dispute: కృష్ణా కేటాయింపులపై రిట్ ఉపసంహరణకు తెలంగాణ ఓకే!
కృష్ణా నీటి కేటాయింపుల్లో అన్యాయంపై ట్రైబ్యునల్ విచారణకు మొదటి నుంచి తెలంగాణ పట్టుపట్టింది. కేంద్రం స్పందించకపోవడంతో ... ‘సుప్రీం’కు నివేదించింది. కేసు వెనక్కు తీసుకుంటే పరిశీలిస్తామని జల్‌శక్తి శాఖ మంత్రి తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోలవరం ప్రాజెక్టులో గోదావరి వరద నీటిని అప్రోచ్ ఛానల్ మీదుగా శుక్రవారం నుంచి మళ్లించే అవకాశం ఉందని సమాచారం. గోదావరి సహజ ప్రవాహ మార్గంలో కాకుండా ప్రస్తుతం మళ్లింపు మార్గంలో నీటిని వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం స్పిల్‌వే మీదుగా నీటిని వదిలేందుకు అప్రోచ్ ఛానల్‌ను కొంతమేర తవ్వారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైనా విధుల్లో ఉన్నట్లే..
ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి కేంద్రం తీపి కబురు తెలిపింది. లాక్‌డౌన్ల కారణంగా కార్యాలయాలకు రాలేక ఇళ్లకే పరిమితమైన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల పరిధిలో పనిచేసే పొరుగుసేవల, ఒప్పంద ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు (ఆన్‌డ్యూటీ కింద) పరిగణించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వ్యాన్‌ను ఢీకొన్న బస్సు- నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా- కాన్పుర్ రహదారిపై ఆగి ఉన్న వ్యానును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ రకం వైరస్‌తో మూడో దశ ముప్పు!
డెల్టా రకం వైరస్ తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే.. బ్రిటన్‌లో మూడో దశ వైరస్ విజృంభణకు అవకాశాలు కనిపిస్తున్నాయని లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆసియా అపర కుబేరులుగా ముకేశ్- అదానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ ఆసియా కుబేరులుగా నిలిచారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టెస్ట్ ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో జడేజా@2
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి చేరాడు. బ్యాట్స్మన్లలో రోహిత్ ఏడో స్థానానికి ఎగబాకాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ జీపు పంపితేనే షూటింగ్‌కు వస్తానన్న బాలయ్య!
నందమూరి బాలకృష్ణ (Balakrishna) అంటే దర్శకుల హీరో అని పేరు. డైరెక్టర్లను ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వారు ఏమి చెబితే అదే చేస్తుంటారు అని అంతా అంటారు. అయితే ఓ సినిమా కోసం ఆయన ఓ షరతు పెట్టారని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">