ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - recent news

ప్రధాన వార్తలు @ 7 PM

7PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : May 10, 2021, 6:59 PM IST

  • రాష్ట్రంలో కరోనా కల్లోలం

రాష్ట్రంలో కొత్తగా 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 84 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 60,124 కరోనా పరీక్షలు చేశారు. కరోనా నుంచి మరో 16,167 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అందుకే వ్యాక్సిన్ కొరత'

రాష్ట్రంలో 45 ఏళ్లు పూర్తైన వారికి ముందుగా వ్యాక్సిన్ వేసి ఆ తర్వాత మిగిలిన వారికి ఇస్తామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారన్న ఆయన.. కేంద్రం నుంచి తగిన డోసులు రాని కారణంగా అందరికీ వేయలేకపోతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీరెందుకు సీఎంగా ఉండటం?: చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వ్యాక్సిన్ అందించకుండా బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మేం హైదరాబాద్​ ఆస్పత్రికి రాకూడదా?'

'కేసీఆర్​ అన్నా.. విభజన సమయంలో మీరూ మేం ఒక్కటే అన్నారు.. ఇప్పుడేమో.. కనీసం ఆస్పత్రికి వద్దామంటే.. రానివ్వట్లేదు. జగనన్నా.. మీరేమో అన్నీ ఉచితమన్నారు.. ఇప్పుడేం చేస్తున్నారు.. నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి..' అంటూ... తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ ఆవేదనతో అన్న మాటలివి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వ్యక్తిగత అజెండా ముఖ్యమా?'

కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడింది కాంగ్రెస్​. వ్యక్తిగత అజెండాతో కాకుండా.. ప్రజా సేవకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించింది. టీకాల సరఫరా తగినంతగా లేదని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రతిపక్ష నేతగా సువేందు

బంగాల్​ అసెంబ్లీలో భాజపా ఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎంపిక చేసింది అధిష్ఠానం. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం సువేందు పేరును ప్రకటించారు కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రపతికి కాంగ్రెస్​ లేఖ

దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్రపతిని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి.. రామ్​నాథ్ కోవింద్​కు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఓడిన నేపాల్ ప్రధాని ఓలీ

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. ప్రతినిధుల సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఓలీకి 93 ఓట్లు వచ్చాయి. సీపీఎన్​ మావోయిస్ట్‌ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్‌ మద్దతు ఉపసంహరించుకోగా మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో ఈ బలపరీక్ష జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాబర్​​కు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్​'

ఏప్రిల్​కుగానూ ప్లేయర్​ ఆఫ్ ది మంత్​ అవార్డులను ప్రకటించింది ఐసీసీ. పాకిస్థాన్​ సారథి బాబర్​ అజామ్​, ఆస్ట్రేలియా మహిళా వికెట్ ​కీపర్​ అలీస్సా హేలీ​ ఈ పురస్కారాలను దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కర్ణన్' ఓటీటీ రిలీజ్​

ఇటీవల తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ధనుష్ 'కర్ణన్' సినిమా.. ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్​లో మే 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.