- అక్టోబరు 15న కళాశాలలు తెరవాలి
రాష్ట్రంలో అక్టోబరు 15న కళాశాలలు తెరవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరులో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఉన్నత విద్యపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- చిరుని కలిసిన సోమువీర్రాజు
సినీ నటుడు చిరంజీవిని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినందుకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఊపిరి తీసిన కారు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో విషాదం జరిగింది. ఆడుకుంటూ కారులోకి వెళ్లి డోర్ లాక్ అయ్యి ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- నిద్రమత్తు వీడండి
రాష్ట్ర పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముస్లిం, దళిత, గిరిజన మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే దిశచట్టం అసలు అమల్లో ఉందా..? అన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ
మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ.. రాజీనామ చేయడంతో ఖాళీ అయిన శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈమేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 2024 ఎన్నికల వ్యూహమేనా?
ప్రతి ఎన్నికల సమయంలో భాజపా రూపొందించే మేనిఫెస్టోలో ప్రధాన అంశం... అయోధ్యలో రామమందిర నిర్మాణం. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన భూమి పూజతో ఆ కల నెరవేరబోతోంది. అయితే ఇంతకాలం ఆధ్యాత్మిక అంశంగా భావించిన రామమందిర నిర్మాణం విషయంలో భాజపా రాజకీయంగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- నిఘాకు 6 ప్రత్యేక ఉపగ్రహాలు!
సరిహద్దులో చైనా కదలికలను తెలుసుకునేందుకు ఉపగ్రహాలను సమకూర్చుకోవాలని భావిస్తోంది భారత సైన్యం. పొరుగు దేశ సైన్యంపై పూర్తి స్థాయి నిఘా ఉంచేందుకు కనీసం 4-6 ఉపగ్రహాలు అవసరమవుతాయని అంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- మూడు రోజుల్లోనే కరోనా ఖతం!
కరోనా నుంచి వేగంగా కోలుకునేందుకు ఆర్ఎల్ఎఫ్-100 దోహదపడుతోంది అంటున్నారు పరిశోధకులు. శ్వాస ఆడక వెంటిలేటర్లపై కొవిడ్‌తో పోరాడుతున్నవారికి సైతం ఈ మాత్రలు వేయడం ద్వారా మూడు రోజుల్లోనే ఉపశమనం లభిస్తోందని పేర్కొన్నారు. ఇంత వేగమైన ఫలితాలను ఇప్పటివరకు ఏ కరోనా ఔషధమూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కోహ్లీని ఔట్ చేయడం అద్భుతం
సన్ రైజర్స్ పేసర్ ఖలీల్ అహ్మద్.. 2019 ఐపీఎల్‌కు సంబంధించి తనకు ఇష్టమైన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ను ఔట్ చేయడం అద్భుతమైన అనుభవమని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 'అంధాధున్' రీమేక్‌లో నయనతార!
యువ నటుడు నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. 'అంధాధున్' రీమేక్‌గా తెరకెక్కనుందీ సినిమా. అయితే ఇందులో నయనతార ఓ కీలక పాత్ర పోషించనుందని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..