ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు@7AM - ఆంధ్రప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

.

7am topnews
ప్రధానవార్తలు@7AM
author img

By

Published : Sep 6, 2022, 7:00 AM IST

  • రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం పని చేస్తున్నాం: సీఎం జగన్​

ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన విద్యా విధానం ఉండాలనే లక్ష్యంతో...మూడేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో గురపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన...టీచర్ల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితి రావాలన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుంటే...ప్రతిపక్షం టీచర్లను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని సీఎం ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నెల్లూరు జిల్లాలో దారుణం.. బాలికపై మేనమామ యాసిడ్​ దాడి

మేనమామ అంటే.. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన వాడు. భవిష్యత్​కు దారి చూపాల్సిన వాడు. కానీ కామం మత్తులో మేనకోడలిపైనే కన్నేశాడు. గత కొన్ని రోజులుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది ఎవరికీ చెప్పుకోలేక ఆమె కుమిలిపోయింది. దాంతో అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈరోజు అది శృతిమించి.. ఆమెపై యాసిడ్​ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు కోశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మారణాయుధాలతో దాడి చేస్తే.. నామమాత్రపు కేసులా?: తెదేపా

రౌడీయిజాన్ని నమ్ముకున్నవాళ్లు ఎవరూ బాగు పడలేదని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా నేతల దాడిలో కన్ను కోల్పోయిన చెన్నుపాటి గాంధీని పరామర్శించిన ఆయన.. ఓటమి భయంతోనే అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు దాడిలో పాల్గొన్న వారి నేరచరిత్రను తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గ్రామపంచాయతీ ఉద్యోగుల సమ్మె సైరన్‌..

తమ డిమాండ్లు సాధించుకునేందుకు గ్రామ పంచాయతీ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్టోబర్​ 2 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీ రాజ్​ కమిషనర్​కు సమ్మె నోటీసు పంపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాహుల్​ గాంధీని కలిసిన బిహార్​ ముఖ్యమంత్రి.. దాని గురించే చర్చ!

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్.. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి గంట పాటు చర్చించారు. వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో కుడా నీతీశ్ సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగానే నీతీశ్​.. నాయకులను కలుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నన్ను ఇరికించాలని చూశారు.. ఆ ఒత్తిడితోనే సీబీఐ అధికారి సూసైడ్​'

తనను తప్పుడు ఎక్సైజ్‌ కేసులో ఇరికించాలనే ఒత్తిడి రావడంతో ఓ సీబీఐ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఆరోపించారు. ఎమ్మెల్యేలను లాగేసుకోవడం ద్వారా భాజపాయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడంపైనే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తున్నారని విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రిషి సునాక్​ ఓటమి.. బ్రిటన్​ నూతన ప్రధానిగా లిజ్​ ట్రస్​..

బ్రిటన్​ నూతన ప్రధానమంత్రిగా లిజ్​ ట్రస్​ ఎన్నికయ్యారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్​పై ఆమె విజయం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్‌ ట్రస్​ను ఎన్నుకున్నారు. కన్జర్వేటివ్​ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు అంతర్గతంగా పోలింగ్‌ జరగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ పోస్టాఫీసు పథకంతో రెట్టింపు రాబడి.. ఎన్ని నెలల్లో అంటే?

దీర్ఘకాలంలో మెరుగైన రాబడి ఆశించే చిన్న డిపాజిటర్లకు పోస్టాఫీసులో మంచి వడ్డీరేటుతో కూడిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం.. అందులో కొన్ని. ఈ పథకాల్లో దాదాపు 7 శాతం వరకు వడ్డీరేటు లభిస్తోంది. ఈ కోవకు చెందిన మరో పథకమే 'కిసాన్‌ వికాస్‌ పత్ర (కేవీపీ)'. ప్రస్తుతం ఈ స్కీం వడ్డీరేటు 6.9 శాతంగా ఉంది. ఏటా వడ్డీని అసలులో కలుపుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్పెషల్‌ పర్సన్‌కు 'టీచర్స్‌ డే' విషెస్​​ చెప్పిన గంగూలీ.. ఎవరంటే..?

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డెబో మిత్రా, జాన్‌ రైట్, గ్యారీ కిర్‌స్టెన్‌తోపాటు గ్రెగ్ చాపెల్‌కు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ శుభాకాంక్షలు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. ఈ సందర్భంగా తన క్రికెట్ కెరీర్‌లో చోటుచేసుకున్న ఎత్తుపల్లాలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మత్తెక్కిస్తున్న బాలీవుడ్​ భామలు.. వీరి అందాలపై ఓ లుక్కేయండి

బాలీవుడ్​ హీరోయిన్లు తమ లేటెస్ట్​ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. మలైకా అరోరా, మౌని రాయ్​, ఇషితా దత్తా, రకుల్​ప్రీత్​ సింగ్​, సన్నీ లియోని తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.. ఓ సారి వాటిపై లుక్కేద్దామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.