ETV Bharat / city

Mega Textile Parks: ఏడింటి కోసం పది రాష్ట్రాలు పోటీ.. మరి తెలుగు రాష్ట్రాలు?

7 Mega Textile Parks Under PM Mitra: రూ.4,445 కోట్ల బడ్జెట్​తో దేశవ్యాప్తంగా ఏడు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరెల్‌ (పీఎంమిత్ర) పార్కులు ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శనా జర్దోష్‌ తెలిపారు. ఏడింటి కోసం పది రాష్ట్రాలు పోటీపడుతున్నాయని.. వాటిలో తెలుగురాష్ట్రాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.

Mega Textile Parks
Mega Textile Parks
author img

By

Published : Dec 11, 2021, 2:14 PM IST

7 Mega Textile Parks Under PM Mitra: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తలపెట్టిన ఏడు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరెల్‌ (పీఎం మిత్ర) పార్కుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా తమిళనాడు, పంజాబ్‌, ఒడిశా, గుజరాత్‌, రాజస్థాన్‌, అస్సాం, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఆసక్తి ప్రదర్శించినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శనా జర్దోష్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. రూ.4,445 కోట్ల బడ్జెట్‌తో 2027-28 నాటికి ఈ పార్కుల ఏర్పాటుచేయాలన్నది కేంద్రం లక్ష్యమన్నారు. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో ఎక్కడ వీటిని ఏర్పాటుచేయాలన్న విషయాన్ని ‘ఛాలెంజ్‌ మోడ్‌’ ప్రాతిపదికన ఖరారుచేయనున్నట్లు పేర్కొన్నారు.

హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ మార్గం మార్పునకు వినతి

హైదరాబాద్‌-ముంబయి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ మార్గంలో మార్పులుచేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. దీన్ని తొలుత పుణె, సోలాపుర్‌ మీదుగా నిర్మించాలనుకున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం జాల్నా, నాందేడ్‌ మీదుగా నిర్మించాలని కోరుతోందన్నారు. దీనివల్ల దూరం పెరిగి, నిర్మాణ ఖర్చు, ప్రయాణ సమయం భారీగా పెరుగుతుందన్నారు. పుణె-ఔరంగాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదనేమీ లేదన్నారు.

మూడు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

నీటి వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రాలు వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంత రైతులకు కేంద్రం సూచనలు జారీచేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో తెరాస సభ్యుడు సురేష్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ఇదీ చూడండి:

School Education On Merging: 'హైస్కూళ్లలో 100లోపు విద్యార్థులుంటే విలీనం వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.